రాజకీయ నేతలంటే రాజకీయాలు మాత్రమే మాట్లాడే రోజులు పోయాయి. అరకొరగా మాట్లాడుతూ.. హడావుడి చేసే రోజులు నెమ్మది నెమ్మది గా తగ్గుతున్నాయి. అహంకారం కంటే కూడా అప్యాయతకు పెద్దపీట వేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించేస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. కాస్తంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి కూడా.
తెలంగాణలో ఆత్మహత్యల నివారణకు ప్రత్యేకంగా ఒక సెల్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆత్మహత్యల నివారణకు ఈ సెల్ పని చేయనుంది. సెల్ ను ప్రారంభించిన సందర్భంగా తొలి కాల్ ను మంత్రి లక్ష్మారెడ్డి అందుకున్నారు. తన ప్రేమ విఫలమైన కారణంగా తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్లు కిరణ్ అనే కుర్రాడు మాట్లాడాడు.
అతని సమస్య విన్న మంత్రి లక్ష్మారెడ్డి తొందరపడి ఆత్మహత్య చేసుకోవద్దని.. ప్రేమ కోసం ప్రాణాలు తీసుకుంటే.. కని పెంచిన వారి సంగతేమిటంటూ ఆయన ప్రశ్నించారు. జీవితం విలువైనదని.. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని సూచించిన మంత్రి.. సెక్రటేరియట్ కు వచ్చి తనను కలవాలని.. ప్రేమ గురించి తాను చెబుతానన్నారు.
ఈ సందర్భంగా సదరు యువకుడికి తన ఫోన్ నెంబర్ ఇచ్చిన మంత్రి లక్ష్మారెడ్డి.. తనను కలవాలని మరోసారి సూచించారు. మొత్తానికి ప్రేమ అంటే ఏమిటో.. తాను చెబుతానని.. తనను కలవాలని ఒక సామాన్య వ్యక్తితో మంత్రి స్థాయి నేత చెప్పటం.. ఆత్మహత్య ఆలోచన నుంచి సరికొత్త ఆలోచన కలిగేలా చేయటం అభినందనీయం.