లక్ష్మీపార్వతి టాలెంట్ కు మరో గుర్తింపు

Update: 2020-02-26 14:07 GMT
లక్ష్మీపార్వతి... తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ పేరు. ఆమె ఎన్టీఆర్ భార్యగా అందరికీ తెలుసు. కానీ ఆమె సాహితీ వేత్త అని కొందరికే తెలుసు. ఆమె తెలుగు సాహిత్యంలో దిట్ట. ఆ నైపుణ్యం వల్లనే తన ఆత్మకథ రాస్తాను అంటే తెలుగులో ఆమెకు ఉన్న పట్టుపై ఎన్టీఆర్ ముగ్దుడై ఆమెకు ఆ అవకాశం ఇచ్చారు. తర్వాత కథ అందరికీ తెలుసు.

ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ఆమెను తెలుగు అకాడమీ ఛైర్మన్ గా నియమించారు. అది ఆమెకు సముచితమైన పదవే. దానిని ఆమె తాజాగా పలుమార్లు నిరూపించుకున్నారు కూడా. ఛైర్మన్ హోదాలో విశాఖపట్నంలో పలు సాహితీ సభల్లో పాల్గొన్న ఆమె తెలుగు సాహిత్య పరిజ్జానం పలువురిని మంత్రముగ్దులను చేసింది. ఏమో అనుకున్నాం గాని... జగన్ సరైన వ్యక్తికి సరైన పదవి ఇచ్చారు అని కొనియాడేలా ఆమె తన బాధ్యతలు నిర్వరిస్తున్నారు. అయితే, తాజాగా ఆమెకు ఇష్టమైన మరో వ్యాపకం దొరికింది. అది కూడా కొత్త రాజధాని నగరం విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్ గా ఆమెను యూనివర్సిటీ ఆహ్వానించింది.

ఏయూ వీసీ ప్రసాదరెడ్డి ఈమేరకు ఆమెకు ఆహ్వానం పంపారు. ఇది నాకిష్టమైన పని. మనకున్న జ్జానం నలుగురికీ పంచడం మనల్ని మరింత అభివృద్ధి చేస్తుంది. బోధనకు అవకాశం ఇచ్చినందుకు వీసీకి కృతజ్జతలు. తప్పకుండా ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తాను అని ఆమె పేర్కొన్నారు.
Tags:    

Similar News