హరికృష్ణ మరణంపై లక్ష్మీ పార్వతి స్పందన

Update: 2018-08-29 10:37 GMT
ఎన్టీ రామారావు తనయుడు హరికృష్ణ మరణం తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కచి వేస్తోంది. నందమూరి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగి పోయారు. నందమూరి కుటుంబ పెద్ద చనిపోవడంతో మొత్తం కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యారు. ఈ సమయంలోనే ఎన్టీఆర్‌ రెండవ భార్య అయిన లక్ష్మీ పార్వతి స్పందిస్తూ హరికృష్ణ మరణం తీవ్ర దిగ్బ్రాంతిని కలుగజేసింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నందమూరి ఫ్యామిలీకి లక్ష్మీ పార్వతి దూరంగా ఉంటున్నారు. అయినా కూడా ఈ సమయంలో హరికృష్ణ మరణంపై ఆమె స్పందించకుండా ఉండలేక పోయారు.

ఒక మీడియా సంస్థతో మాట్లాడిన లక్ష్మీ పార్వతి.. ఎన్టీ రామారావు గారికి హరికృష్ణ అంటే ప్రత్యేకమైన అభిమానం - ప్రేమ ఉండేది. ఆయన సీఎంగా బీజీగా ఉన్న సమయంలో - రాజకీయాలతో బిజీగా ఉన్న సమయంలో ఇంటికి పెద్దగా హరికృష్ణ వ్యవహరించేవారు. రాజకీయాల్లోకి హరికృష్ణను తీసుకు రావాలని ఎన్టీఆర్‌ గారు ఆశపడ్డారు. అనుకున్నట్లుగానే ఎమ్మెల్యే - మంత్రిగా కూడా చేశారు. హరికృష్ణ మరణం ఆ కుటుంబంకు పెద్ద లోటు. నందమూరి ఫ్యామిలీ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

హరికృష్ణ పార్థీవ దేహంను చూసేందుకు వెళ్లాలని ఉన్నా కూడా ఈ సమయంలో అక్కడకు వెళ్లడం సరికాదని వెళ్లడం లేదు అంటూ ఆమె సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చారు. లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోవద్దంటూ అప్పట్లో ఎన్టీఆర్‌ ను హరికృష్ణ ఎదిరించినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్టీఆర్‌ హరికృష్ణకు ప్రాముఖ్యత తగ్గించారు అనేది కూడా కొందరి వాదన. ఏది ఏమైనా హరికృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. తన తండ్రి మరియు తనయుడి చెంతకు చేరారు.
Tags:    

Similar News