దివంగత ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా లక్ష్మీపార్వతి నివాసానికి దగ్గర్లో వైన్ షాప్ ఏర్పాటుచేయాలని భావించింది. దీనిపై మీడియాతో మాట్లాడుతూ సర్కారు తీరును తప్పుపట్టారు. ఈ మేరకు ఆమె ఎక్సైజ్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ దివంగత ఎన్ టీఆర్ కాలం నాటి మద్య నిషేధం గురించి కీలక విషయాన్ని వెల్లడించారు.
1994 ఎన్నికల సమయంలో సారాయి వ్యతిరేక ఉద్యమం సాగిన సమయం నాటి పరిస్థితులను ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. ఆనాడు నెల్లూరులో దూబగుంట రోశమ్మ మొదలుపెట్టిన ఈ ఉద్యమానికి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మద్దతు ఇచ్చిందని తెలిపారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధాన్ని అమలుచేయాలని ఎన్టీఆర్‌కు తాను సూచించానని లక్ష్మీపార్వతి వివరించారు. తన సలహా మేరకు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ నిషేధాన్ని విధించారని లక్ష్మీపార్వతి తెలిపారు. కాగా, అనంతరం చంద్రబాబు ప్రభుత్వం మద్యనిషేధాన్నిఎత్తివేయడంపై లక్ష్మీపార్వతి అసంతృప్తి వ్యక్తం చేశారు.
1995 ఆగస్టు సంక్షోభం తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నిషేధాన్ని ఎత్తివేయించారు. మద్యనిషేధం అమలులో ఉన్నప్పటికీ...నిబంధనలు లోపభూయిష్టంగా ఉండటం వల్ల...మద్యం అందుబాటులోకి వచ్చిందని పేర్కొంటూ దీనిపై ప్రజలు, స్వచ్ఛంద సంస్తల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టిన బాబు సర్కారు అనంతరం నిషస్త్రధాన్ని ఎత్తివేసదింది. దీనిపై పలు వర్గాలు చంద్రబాబు సర్కారు తీరును తప్పుపట్టాయి.