ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు చెప్పిన చంద్రబాబు 2014 ఎన్నికల సమయానికి మాత్రం మోడీ కాళ్లు పట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఉదంతం చూస్తే చాలు.. చంద్రబాబు ఎంతటి అవకాశవాదో ఇట్టే అర్థమవుతుందన్నారు. అసరమైతే కాళ్లు పట్టుకోవటం.. అవసరం తీరాక విసిరి గోదార్లో పడేయటం బాబుకు బాగా తెలుసన్నారు.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని దివంగత మహానేత ఎన్టీఆర్ స్థాపించారన్నారు. అలాంటిది పిల్లనిచ్చిన మామకు ఒకసారి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు టీడీపీ వ్యతిరేకపార్టీ అయిన కాంగ్రెస్‌తో జట్టు కట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా చెప్పారు.
ప్రస్తుతం టీడీపీకి వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్ తో జట్టు కట్టటానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అందుకే.. ఆయన్ను.. ఆయన పార్టీని గోదాట్లో కలిపేందుకు ఏపీ ప్రజలు సిద్ధమవుతున్నట్లుగా చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ.. జనసేన అండగా ఓటమి గండం నుంచి బయటపడిన చంద్రబాబు.. ఒంటరిగా పోటీ చేస్తే ఓటమి ఖాయమన్న భావనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ తో జట్టు కట్టటం ద్వారా.. మరోసారి లబ్థి పొందాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళలోనే.. లక్ష్మీపార్వతి బాబును ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.