చదువు సంధ్యా లేకుండా వ్యసనాల బారిన పడటంలో ఒక అర్థం ఉంటుంది. బాగా చదువుకొని.. పేరు ప్రఖ్యాతులు వచ్చే రంగంలో ఉన్న ప్రముఖుడు వ్యసనాల బారిన పడటాన్ని క్షమించలేం. తాజాగా ముంబయిలో చోటు చేసుకున్న ఉదంతం గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.
మోడల్ గా పని చేస్తున్న 23 ఏళ్ల లక్ష్య సింగ్ అనే మోడల్ డ్రగ్స్ ఊబిలో చిక్కుకుపోయాడు. తాజాగా తల్లి సునీతా సింగ్ (45)తో గొడవ పడి ఆవేశంతో చేయి చేసుకొని ఆమె మరణానికి కారణమైన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఆర్థిక సమస్యల అంశం మీదా తల్లి..కొడుకుల మధ్య హత్య జరగటానికి ముందు రోజు రాత్రి గొడవ చోటు చేసుకుందని చెబుతున్నారు.
తల్లి కొడుకుల మధ్య మాటా..మాటా పెరిగి.. ఆవేశం ఆపుకోలేక తల్లిని బలంగా తోసేశాడు. దీంతో ఆమె తల బాత్రూంలోని వాష్ బేసిన్ కి తగిలింది. దీంతో ఆమె మరణించారు. ఈ గొడవ జరిగినప్పుడు కొడుకుతో పాటు.. అతని కాబోయే భార్య కూడా ఇంట్లోనే ఉండటం గమనార్హం. డ్రగ్స్ మత్తులో ఉన్న వేళ జరిగిన ఈ గొడవపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు లక్ష్య సింగ్ ను.. అతడి కాబోయే భార్య మీదా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నత ఆదాయ వర్గానికి చెందిన ఈ కుటుంబ వ్యవహారం ఇప్పుడు ముంబయిలోని ఒషివారాలో స్టేషన్ పరిధిలో సంచలనంగా మారింది.