ఆయన రాజకీయ భీష్మాచార్యుడు. ఈ రోజు దేశమంతా గర్వించే నేతగా ఆయన పేరు చెప్పుకోవాలి. ఆయనది నిండు జీవితం. అంతే కాదు, రాజకీయంగా మచ్చ లేని ప్రస్థానం. ఆయనే లాల్ కిష్ణ అద్వానీ. అఖండ భారతంలో పాకిస్థాన్ లోని కరాచీ ప్రాంతంలో 1927 నవంబర్ 8న అద్వానీ పుట్టారు. భారత్ పాక్ విభజన తరువాత అద్వానీ కుటుంబం యావత్తు వచ్చి భారత్ లో స్థిరపడ్డారు. అలా గుజరాత్ లో ఉక్కు మనిషి పటేల్ వారసుడిగా రాజకీయంగా ఎదిగారు. ఆయన ఆరెస్సెస్ లో చేరి దేశానికి ఎంతో సేవ చేశారు. వాజ్ పాయితో కలసి నాటి జన సంఘ్ తో అడుగులు వేసిన అద్వానీ తదనంతరం ఆవిర్భవించిన బీజేపీకి రధ సారధిగా మారారు. కేవలం రెండు సీట్లు మాత్రమే ఉన్న బీజేపీని 200 సీట్ల దాకా పెంచిన ఘనత ఆయనదే.
అద్వానీ చేసిన అయోధ్య రధ యాత్రతోనే బీజేపీ ఉవ్వెత్తున ఎగిసి ఎదిగింది. ఆ రాజకీయ ఫలాలను ఆయన ఒక్కరే ఆస్వాదించలేదు. తన ప్రియమైన స్నేహితుడు వాజ్ పేయ్ ని ప్రధానిగా చేసి తాను ఆయన పక్కన ఉండిపోయారు. ఉప ప్రధానిగా 2002 నుంచి 2004 వరకూ పనిచేసిన అద్వానీకి తీరని కోరిక ఒకటి ఉంది. ఈ దేశానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలని. అయితే అది మాత్రం కుదరలేదు. ఆయన ప్రియ శిష్యుడుగా బీజేపీలో ఎదిగి ఈ రోజు దేశానికి రెండు సార్లు ప్రధాని అయిన నరేంద్ర మోడీ అద్వానీ విషయంలో కొంత దూరం పాటించారనే విమర్శలు ఉన్నాయి. 2014లో అద్వానీని ప్రధానిగా కొంతకాలం చేసి ఆ తరువాత మోడీ చేపడతారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. ఇక 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో అద్వానీ పేరునే అంతా తలచారు. ఆయనకు ఆ అత్యున్నత స్థానం దక్కుతుంది అనికూడా భావించారు.
కానీ అది కూడా జరగలేదు. నిజానికి నాడు బీజేపీకి పూర్తి మెజారిటీ ఎలక్ట్రోల్ కాలేజ్ లో ఉంది. అద్వానీని అలా సమున్నతంగా గౌరవించుకునే వీలు కూడా ఉంది. ఎందుకో అది సాకారం కాకుండా పోయింది. ఇక 2019 నాటికి అద్వానీ ఎన్నికలలో పోటీ చేయకుండా తప్పుకున్నారు. ఆయన కుమార్తెకు అవకాశం ఇస్తామని పార్టీ చెప్పినా ఆయన తిరస్కరించినట్లుగా వార్తలు వచ్చాయి. మొత్తానికి బీజేపీకి దశ దిశా చూపిన రాజకీయ కురు వృద్ధుడు అద్వానీకి కాషాయం పార్టీలోనే తీరని అన్యాయం జరిగింది అని మాత్రం అంతా అనుకుంటారు.
ఎన్నో ఎత్తు పల్లాలను ఆయన రాజకీయ జీవితంలో చూశారు. కానీ కోరిన పదవులు మాత్రం దక్కలేదు. ఈ రోజు బీజేపీ ఇంతలా రాటుదేలడానికి పునాదులేసిన అద్వానీకి దక్కాల్సిన గౌరవాలు, పదవులు రాకపోవచ్చు కానీ ఆయన మాత్రం భారతీయ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ విశిష్ట స్థానాన్ని కలిగి ఉంటారని అంతా అంటారు. తాజా పుట్టిన రోజుతో 94 ఏళ్ళు నిండిన అద్వానీ శత వసంతాలు పూర్తి చేసుకుని పూర్ణాయుష్కుడిగా ఆరోగ్యవంతుడిగా జీవించాలని అంతా కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా అద్వానీ బర్త్ డే వేళ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ వంటి వారంతా ఆయన ఇంటికి వెళ్ళి వేడుకలను దగ్గరుండి జరిపించడం విశేషం. బీజేపీ అంటే వాజ్ పేయ్ అద్వానీ మాత్రమే. రెండు కళ్ళుగా వారు పార్టీని చూశారు. వారి స్పూర్తిని నిండా నింపుకున్న నాడే బీజేపీ మరిన్ని ఏళ్ళు ఈ దేశాన్ని ఏలగలుతుంది అన్నది మాత్రం పరమ సత్యం.