నటితో లలితా జ్యువెలరీ దొంగ పరార్

Update: 2019-10-06 06:56 GMT
రీల్ మీద వారిద్దరూ నటీనటులు. రీల్ వెనుక ఏం జరిగిందన్న విషయం మీద క్లారిటీ రాకున్నా. తాజాగా సంచలనంగా మారిన తిరుచ్చి లలితా జ్యువెలరీ చోరీ కేసులో నిందితుడు.. తాజాగా ఒక నటిని తనతో తీసుకెళ్లిన వైనం మరో సన్సేషన్ గా మారింది. తిరుచ్చిలోని లలితా జ్యువెలరీలో రూ.13 కోట్ల విలువైన నగల్ని దోచేసిన గుర్తు తెలియని వ్యక్తుల్ని గుర్తించారు పోలీసులు.

తిరుచ్చి సత్రం బస్టాండ్ కు దగ్గరే ఉండే లలితా జ్యువెలరీలో భారీ ఎత్తున చోరీ చేసిన వారిలో తిరువారూరు మడపురానికి చెందిన మణికంఠన్ ఒకరైతే. మరొకరు సురేశ్ గా. సురేశ్ మామ మురుగన్ గా గుర్తించారు. మురుగున్ గతంలో పలు చోరీ కేసుల్లో నిందితుడే కాదు. తెలుగులో రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తన మామ మురుగున్ నిర్మించిన చిత్రాల్లో నటించిన సురేశ్ కూడా తాజా చోరీలో పాలు పంచుకున్నట్లుగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే. తాజాగా ఈ చోరీలో పాల్గొన్న మణికంఠన్ ను పోలీసులు పట్టుకోవటం. అతని దగ్గరున్న నాలుగు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా తనతో పాటు చోరీకి పాల్పడిన వారు మురుగున్. సురేశ్ అని వెల్లడించాడు. ఇదిలా ఉంటే. సురేష్ కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అతడో సినీ నటిని తనతో పాటు విదేశాలకు తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు.లలితా జ్యువెలరీలో చోరీ అనంతరం. ఒక నటిని తన వెంట తీసుకొని శ్రీలంకకు వెళ్లిపోయినట్లుగా భావిస్తున్నారు. అయితే. దొంగ వెంట వెళ్లిన నటి ఎవరు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సురేశ్ ను అదుపులోకి తీసుకుంటే కానీ. మరిన్ని విషయాలు బయటకు రావటం ఖాయం.
Tags:    

Similar News