బీహార్ లో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్(మాజీ ముఖ్యమంత్రి లాలూ తనయుడు) ముఖ్యమంత్రయ్యారు. ఆశ్చర్యపోతున్నారా... అక్కడ జేడీయూ - ఆర్జేడీల మధ్య పొత్తుల ప్రభుత్వం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి సీటు పంపకం లేనప్పుడు తేజ్ ఎలా సీఎం అవుతారని అనుకుంటున్నారా... ? మీ డౌట్ నిజమే. తేజ్ ప్రతాప్ ముఖ్యమంత్రయ్యారు కానీ, అది రియల్ లైఫ్ లో కాదు - రీల్ లైఫ్ లో. ప్రస్తుతం బీహార్ వైద్య - ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్ ఓ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించారు. ఆ విధంగా ఆయన సీఎం కావాలన్న తన కోరికను తీర్చేసుకున్నారు.
బీహార్ లో లాలూ - ఆయన సతీమణి రబ్రీదేవిలు సీఎంలుగా కొనసాగిన కాలంలో ఆ రాష్ట్రంలో జరిగిన వరుస కిడ్నాప్ లను ఆధారం చేసుకుని భోజ్ పురిలో ‘అపహరన్ ఉద్యోగ్’ పేరిట ఓ చిత్రం తెరకెక్కుతోంది. సదరు చిత్రంలో తేజ్ ప్రతాప్ సీఎం పోస్టులో కనిపించనున్నారు. పాత్ర నిడివి చిన్నదిగానే ఉన్నా, చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఇటీవలే పాట్నా సమీపంలోని రాజ్ గిర్ ప్రాంతంలో ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ జరిగిందట. ఈ షూటింగ్ లోనే తేజ్ ప్రతాప్ తన ముఖానికి రంగేసుకుని సీఎం పాత్రలో కనిపించి ముచ్చట తీర్చుకున్నారు.
కాగా జేడీయూతో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో తేజ్ ప్రతాప్ మంత్రిగా ఉండడంతో ఆయన రాజకీయాల్లో అనుభవం సంపాదిస్తున్నారు. మరోవైపు ఆర్జేడీకి కూడా మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తేజ్ ప్రతాప్ రియల్ లైఫ్ లో కూడా సీఎం అయినా కావొచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఆయన సినిమా ముఖ్యమంత్రి మాత్రమే.