బీహార్ లో ఆర్జేడీకి ఊహించని దెబ్బ

Update: 2020-10-10 14:00 GMT
బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆర్జేడీ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీకి లాలూ ప్రసాద్ సేవలు అందేలా కనిపించడం లేదు. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ అవతరించింది. నితీష్ తో కలిసి ప్రభుత్వాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ ఏర్పాటు చేశాడు. కానీ ఆ బంధం విడిపోయి పశుదాణా కేసులో ప్రస్తుతం లాలూ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

అయితే తాజాగా లాలూకు బెయిల్ వచ్చింది. ఇక బయటకు వచ్చేస్తాడని అందరూ అనుకున్నారు. లాలూ వస్తే ఆర్జేడీ గెలుపునకు దోహదపడుతుందని అందరూ అనుకున్నారు. ప్రస్తుతం ఆర్జేడీ తరుఫున ఆయన కొడుకు తేజస్వీ యాదవ్ అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు.

ప్రస్తుతం 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్ లో ఈ పార్టీ 143 సీట్లలో ఆర్జేడీ పోటీచేస్తోంది. మరో 70 సీట్లకు కాంగ్రెస్ పోటీ చేస్తుంటే.. మిగిలిన సీట్లలో చిన్నా చితకా భాగస్వామ్య పార్టీలు పోటీచేస్తున్నాయి.

బీజేపీ-జేడీయూ ఒక జతగా.. ఆర్జేడీ-కాంగ్రెస్ మరో జతగా బీహార్ లో అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. బీజేపీ తరుఫున ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ తరుఫున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రావడం ఖాయమైంది.

అయితే వీరిందరిలోకి బీహార్ లో అత్యంత ప్రభావం చూపగల నేత లాలూ ప్రసాద్ యాదవ్. కానీ ఆయనకు తగ్గట్లే కోర్టు కూడా లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ వచ్చింది.

కానీ ట్రెజరీని మోసం చేసి రూ.3.3 కోట్లను కాజేసిన కేసు కూడా లాలూపై మరో కేసుంది. ఈ కేసులో కూడా శిక్షపడింది.
Tags:    

Similar News