వ్యంగ్యానికి.. విమర్శలకు ఒక హద్దు అంటూ ఉండాలి. కానీ.. రాజకీయ శత్రుత్వం పుణ్యమా అని అలాంటివన్నీ చెరిగిపోతున్న దుస్థితి. చూస్తుంటే.. రేపొద్దున జరగరానిది జరిగినా కూడా దానికి ఏదో ఒక వ్యంగ్య వాదన తీసుకొచ్చి విమర్శిస్తారేమో. ఆర్జేడీ అధినేత.. వివాదాస్పద వ్యాఖ్యలకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి లాలూ ప్రసాద్ యాదవ్ తాజాగా ఒక చతురోక్తి విసిరారు. కాకపోతే.. ఆయన చేసిన వ్యాఖ్యపై పలువురు విమర్శలు చేస్తున్నారు. వ్యంగ్య విమర్శలు చేయటానికి సమయం.. సందర్భం అక్కర్లేదా అని వ్యాఖ్యాలు చేస్తున్నారు.
బీజేపీ అధినేత అమిత్‌షా పాట్నా ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో బస చేసి.. గురువారం రాత్రి లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ఉదంతం తెలిసిందే. అరగంటసేపు నానా ఇబ్బంది పడి.. చివరకు సీఆర్పీఎఫ్ జవాన్లు లిఫ్ట్ తలుపులు బద్ధలు కొ్ట్టి ఆయన్ను బయటకు తీశారు.
ఈ ఘటనను ప్రస్తావించిన లాలూ.. అమిత్‌షా లావుగా ఉండటం వల్లే లిఫ్ట్ చెడిపోయిందని.. లావుగా ఉన్న వాళ్లు ఆసలు లిఫ్టే ఎక్కొద్దని సలహా ఇచ్చారు. అమిత్ షా లాంటి పర్సనాలిటీ ఉన్న వారు లిఫ్ట్ ఎక్కకుండా ఉండాల్సిందని.. ఎందుకంటే.. అంత లావువాళ్లను లిఫ్ట్ లు మోయలేవన్నారు.
దీనిపై బీజేపీ వర్గాలు మండిపడ్డాయి. నిజానికి లావుగా ఉన్న వాళ్లు ఒక సంఘంగా ఉండరు కాబట్టి సరిపోయింది. లేదంటే.. లాలూ మీద యుద్ధమే ప్రకటించి ఉండేవారు. అయినా.. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం గురించి చింతించటం మానేసి.. వ్యంగ్యంగా వ్యాఖ్యలు చూస్తుంటే.. బీజేపీ.. ఆర్జేడీ మధ్య రాజకీయ శత్రుత్వం ఏ స్థాయిలో ముదిరిపోయిందో ఇట్టే తెలియక మానదు.