దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీహారు మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్న లాలు ఓ ప్రచార సభలో మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ కాలనాగు రూపంలో బీహారును కాటేయాలని చూస్తున్నారని లాలూ ద్వజమెత్తారు.
శ్రీకృష్ణుడు చిన్నతనంలోనే కాలనాగుపామును మట్టుబెట్టాడని, తాను శ్రీకృష్ణుడు పుట్టిన గడ్డకు చెందినవాడినని అన్నారు. మనం కృష్ణుడి వారసులం ...యాదవులం అని బహిరంగ సభలో అన్నారు. యాదవులంతా కలిసి శ్రీకృష్ణుడి కాలనాగును మట్టుబెట్టినట్లే.... ఈ కాలనాగును అంతం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. బీహార్‌లో మోడీ పార్టీ అయిన బీజేపీని యాదవులు మట్టుబెట్టడం ఖాయమని లాలు జోస్యం చెప్పారు. యాదవులను ఆకట్టుకోవడానికి లాలూ ప్రసాద్ లు ఈ విమర్శలు చేశారు.
పనిలో పనిగా తన చిరకాల ప్రత్యర్థి, తాజా మిత్రుడు నితీష్ కుమార్‌పై సైతం వివరణ ఇచ్చారు. తనకు నితీష్ కు ఎలాంటి విబేదాలు లేవని, ఈ విషయంలో బిజెపి దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాజకీయాలలో విమర్శలు సహజం. కానీ కాలనాగు లాంటి విమర్శలు చేయడం..లాలుకే చెల్లిందేమో.