బీహార్ ఎన్నికలు మంచి రసవత్తరంగా ఉన్నాయి.. టిక్కెట్లు కేటాయింపుల్లోనే ఎక్కడలేని రాజకీయాలు - ఎత్తుగడలు.. అలకలు - ఆగ్రహాలు - అనుగ్రహాలు - ఏడుపులు - పెడబొబ్బలు... అన్నీ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ నేతల సమీప బంధువుల విషయంలో జరుగుతున్న పరిణామాలుసామాన్యులకు ఆసక్తి కలిగిస్తున్నాయి.
రాంవిలాస్ పాశ్వాన్ అల్లుడికి టిక్కెట్ ఇవ్వకపోవడం... లాలూ ప్రసాద్ యాదవ్ చిన్నల్లుడు కూడా మామ పార్టీకి వ్యతిరేకంగా పోటీచేస్తుండడం తెలిసిందే. అదేసమయంలో లాలూ అల్లుడిని పట్టించుకోకపోయినా కొడుకులపై మాత్రం ప్రేమ చూపించారు. ఇద్దరికీ రెండు టికెట్లు ఇచ్చి పోటీ చేసుకోండి నాయనా అంటూ పంపించారు. లాలూ కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్ - తేజస్వి యాదవ్ లు ఇద్దరికీ టికెట్లు ఇచ్చారు. తేజ్ ప్రతాప్ మహువా నుంచి... తేజస్వి రాఘేపూర్ లో పోటీ చేయబోతున్నారు. తేజస్వి టికెట్, స్థానం కోసమైతే బీహార్ సీఎం నితీశ్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారట. లాలూతో మాట్లాడి ఆయన్ను ఒప్పించి తేజస్విని రాఘెపూర్ నుంచి పోటీ చేసేలా టికెట్ ఇప్పించారు. మరి లాలూ కొడుకులు బీజేపీ జోరును ఎదుర్కొంటారో లేదంటే తోకముడుస్తారో్ చూడాలి.