కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాస్త చిత్రమైన మనిషి. ఆయనకుండే నమ్మకాలు కాసింత కామెడీగానే కాదు.. ఆయన్ను వార్తల్లో వ్యక్తిగా మారుస్తుంటాయి. ఆయన చేష్టలు అధికారపార్టీకి చిరాకుగా మారినా.. మీడియాకు మాత్రం మాంచి ముడిసరుకుగా మారుతుందనటంలో సందేహం లేదు. తాజాగా ఆయన చేసిన పని అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
తాజాగా ఆయన ఆదివాసీలకు అటవీ భూములపై హక్కు పత్రాల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. పంపిణీ పత్రాల్ని అందుకోవటానికి వచ్చిన ఒక ఆదివాసీ మీసాన్ని తానే స్వయంగా తిప్పిన సీఎం.. ‘‘నేను గిరిజనుడ్ని అని చెప్పు. నేను నీకు అండగా ఉంటా’’ అని చెప్పిన వైనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఒక ముఖ్యమంత్రి తానే స్వయంగా ఒక గిరిజనుడి మీసం తిప్పి మెచ్చుకోవటం.. నేను నీ వెనుక ఉన్నా.. నీకెందుకు మీసం తిప్పు అంటూ చెప్పిన వైనం మీడియాలో ప్రముఖంగా ప్రచారమవుతోంది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. ఇలాంటి జిమ్మిక్కులతో జనాల్ని ఆకర్షించటం సిద్ధరామయ్య లాంటి నేతలకు వెన్నతో పెట్టిన విద్య. మరి.. అవకాశంవచ్చినప్పుడు వదులుకుంటారా ఏంటి?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/