నిర్మాత సీ.కళ్యాణ్ పై భూవివాద కేసు

Update: 2021-06-29 09:30 GMT
తెలుగు రాష్ట్రాల్లో అన్నింటికంటే విలువైన భూమి ఎక్కడుందంటే అది హైదరాబాద్ లోనే.. కోట్లు పలికే భూములున్న ఆ చోటే.. భూవివాదాలు ఎక్కువే. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు, రాజకీయ,సినీ ప్రముఖులు అంతా ఇక్కడే పెట్టుబడి పెట్టడంతో గజం లక్షల్లో పలుకుతుంది.. ఈ క్రమంలోనే భూవివాదాలు కోకొల్లలుగా ఉంటున్నాయి.

తాజాగా షేక్ పేట భూవివాదంలో ప్రముఖ నిర్మాత చిక్కుల్లో పడ్డాడు. ఈ భూవివాదంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సినీ నిర్మాత సి.కల్యాణ్ తోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు కావడం సంచలనమైంది.

అమెరికాలో వైద్యుడిగా స్వరూప్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. 1985లో షేక్ పేటలో ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ నుంచి భూమి కొనుగోలు చేశాడు. 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడు.నారాయణ మూర్తి ఆ స్థలంలో ఆర్గానిక్ స్టోర్ నడుపుతున్నాడు.

అయితే సడెన్ గా నిన్న సాయంత్రం నిర్మాత సి.కళ్యాణ్ పంపిస్తే వచ్చామని.. షరూఫ్, శ్రీకాంత్, తేజస్వి అనే వ్యక్తులు వచ్చి దౌర్జన్యం చేశారని.. ఆర్గానిక్ స్టోర్ కు తాళం వేశారని స్వరూప్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు వీరి ముగ్గురితోపాటు నిర్మాత సి.కల్యాణ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నిర్మాత కళ్యాన్ చిక్కుల్లో పడ్డట్టు అయ్యింది.
Tags:    

Similar News