హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ‘అలకోని’ చెరువు ఒకనాడు మత్తళ్లతో పరవళ్లు తొక్కింది. ఈ చెరువుపై అక్రమార్కులు కన్నుపడటంతో కేవలం ఆరునెల్లలోనే మాయమైంది. దీంతో ఈ ప్రాంతంలో మెరిపిపోతున్న రోడ్లు, నలుపు-పసుపు రంగులతో డివైడర్లు, విద్యుత్తు లైన్లు వెలిశాయి. పట్టణం నడిబొడ్డున ఉన్న చెరువు పూడ్చేసి, లేఅవుట్ చేశారంటే వీరికి ఏ స్థాయిలో అండదండలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చెరువు ను లేఅవుట్ చేయడం ద్వారా రూ.300 కోట్ల వ్యాపారమే లక్ష్యంగా అక్రమార్కులు బరితెగించినట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం సుల్తాన్‌పూర్ పరిధిలో ఉన్న అలకోని చెరువంటే పరిసర ప్రాంతాల్లో తెలియని వారుండరు. గతంలో మత్తళ్లతో పరవళ్లు తొక్కేది. ఇక్కడి రైతులకు సిరులు కురిపించింది. రెవెన్యూ రికార్డుల పరంగా 65/ఎ - 68, 69/ఎ - 70/ఎ - 71/ఎ - 71/ఎఎ - 72/ఇ సర్వే నంబర్లలో విస్తరించి ఉంది. హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో కూడా అవే సర్వే నంబర్లలో ఉందని వివరాలున్నాయి. అందులో నీరు విస్తరించే చెరువు 8.37 ఎకరాలు కాగా, చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం 15.30 ఎకరాలుగా హెచ్‌ఎండీఏ అధికారులు నిర్ధారణ చేశారు. ఈక్రమంలోనే హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో పది ఎకరాల్లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అనుమతులు లేకుండా లేఅవుట్ చేసింది.
*అక్రమార్కులకు కలిసొచ్చిన సర్వేనెంబర్..
కొందరు మధ్యవర్తుల ద్వారా అలకోని చెరువు ఎఫ్‌టీఎల్‌లోని భూములను సదరు రియల్ ఎస్టేట్ సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేసింది. వాటికి సర్వే నంబర్లు ఒకే రకంగా ఉండి, బై నంబర్లు వేర్వేరుగా ఉండడం అక్రమార్కులకు కలిసొచ్చింది. సర్వే నెంబర్ల బై నంబర్లను పరిగణనలోకి తీసుకోకుండా రైతుల నుంచి భూములు దక్కించుకుని 15.30ఎకరాల చెరువును మాయం చేశారు. అలకోని చెరువు లేఅవుట్ విషయం లో అడ్డంకులు ఎదురవుతాయని ముందే ఊహించిన రియల్ ఎస్టేట్ సంస్థ ముందస్తు’ స్టే తెచ్చుకుంది.
లేఅవుట్‌కు అనుమతినిచ్చే అధికారం గ్రామ పంచాయతీ కి లేదు. అయినప్పటికీ మాజీ సర్పంచ్ సంతకంతో లేఅవుట్ కు అనుమతులు తీసుకున్నట్లు కాగితాలు సృష్టించారు. అంతే కాకుండా ఎగువ ప్రాంతం నుంచి అలకోని చెరువులోకి వరద నీటిని తీసుకువచ్చే నాలాను సైతం కబ్జా చేశారు. భవిష్యత్ లో భారీ వర్షాలు కురిస్తే నివాస గృహాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. రెవిన్యూ అధికారులు కబ్జాపై నోటీలిచ్చినా అక్రమార్కులు పట్టించుకోకుండా వెంచర్ అభివృద్ది చేస్తుండటం గమనార్హం. అక్రమార్కులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.