ఒక ఐడియా వ్యవస్థను మార్చేస్తుంది. అయితే.. అది సక్సెస్ అవుతుందా? విఫలమవుతుందా? అన్నది, దాన్ని ఆచరణలో పెట్టే విధానమే తేలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రక్షాళన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా బోధపడుతుంది. అవినీతిని అంతమొందించాలన్న ఆలోచన మంచిదే. అందుకు సిద్ధపడ్డ ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగానే నిలబడ్డారు. కానీ.. ఆ సంస్కరణల అమలు సరిగా లేకపోవడంతో ప్రభుత్వం అభాసుపాలు కావాల్సి వచ్చింది. మరి, ఎందుకిలా జరిగిందని పోస్టుమార్టం చేస్తే.. చాలా విషయాలు కనిపిస్తాయి.
పారదర్శకతే ప్రధానం..
తెలంగాణలో సమీకృత భూరికార్డుల యాజమాన్యం విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఇందుకోసం ధరణి వెబ్‌పోర్టల్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా భూ రికార్డులన్నింటినీ ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయాలని నిర్ణయించారు. భూ పరిపాలన-రిజిస్ట్రేషన్ సేవలు రెండింటినీ అనుసంధానం చేయడం ద్వారా.. స్థిరాస్తి లావాదేవీలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో జరుగుతాయని సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
మూడు నెలలు మూత..
ధరణి పోర్టల్ ద్వారా తెలంగాణలో జరగనున్న రిజిస్ట్రేషన్లు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని కేసీఆర్ ప్రకటించారు. ఈ కొత్త విధానాన్ని అమలుచేసే ప్రక్రియలో భాగంగా.. మూడు నెలల కిందట ఆస్తుల రిజిస్ట్రేషన్ మొత్తం నిలిపివేశారు. అయితే.. కొత్త పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ పలువురు కోర్టు మెట్లు ఎక్కడంతో నూతన విధానం నిలిచిపోయింది. తప్పని పరిస్థితుల్లో పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ అంటూ.. కొత్త విధానాన్నే ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ.. స్టాఫ్ట్ వేర్ మొరాయించడంతో కథ మొదటికొచ్చింది. దీంతో.. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని సర్కారు నిర్ణయించింది.
అలా చేస్తే బాగుండేదా..?
వ్యవస్థలో భారీ మార్పులు తీసుకొచ్చే సమయంలో ఎదురయ్యే సమస్యలు, సవాళ్లపై లోతుగా చర్చించాలి. కానీ.. సర్కారు దీనిపై సరైన హోం వర్క్ చేయలేదని ప్రభుత్వ వర్గాలే గుసగుసలాడుతున్నాయి. పాత పద్ధతిని కొనసాగిస్తూనే.. కొత్త పద్ధతిని క్రమ క్రమంగా ప్రవేశపెడితే బాగుండేదని అభిప్రాయపడుతున్నాయి.
కసరత్తు జరగలేదా?
దాదాపు వంద రోజులపాటు రిజిస్ట్రేషన్స్ ఆగిపోయాయి. దీంతో ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఇంత పెద్ద సంస్కరణ తీసుకొచ్చే ముందు స్టేక్ హోల్డర్స్‌తోపాటు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు, సిబ్బంది ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం అలాంటి కసరత్తు ఏదీ చేయకుండానే.. అమలు చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఐఏఎస్‌లు కుస్తీపట్టినా...
ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో జనం ఎన్నో భయాలతో ఉంటారు. కానీ.. కొత్త పద్ధతిలో ప్రభుత్వం వారికి భరోసా కల్పించలేకపోయిందనే విమర్శ ఉంది. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలు ప్రస్తావించినప్పుడు పట్టించుకోలేదనే వాదనలు కూడా ఉన్నాయి. సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతాయని.. తొందరపడొద్దని అప్పట్లో రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ చెబితే ఆయన్ని పక్కన పెట్టేశారని అంటున్నారు. ఇప్పటికీ ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదని సమాచారం. సమస్య చేయి దాటిపోతున్న సమయంలో సీఎస్‌తోపాటు పదిమంది సీనియర్ ఐఏఎస్ లు వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కుస్తీ పట్టినా ఫలితం లేకపోయిందని సమాచారం.
చేతులు కాలాక..
ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రభుత్వం కమిటీ వేయాలి. కానీ.. ఆగమేఘాల మీద పని మొదలు పెట్టి, అందులో సమస్య తలెత్తి, అది శ్రుతిమించాక కమిటీ వేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే.. రియల్టర్లు, బిల్డర్స్‌తో సమావేశమైన ఆ కమిటీ.. ఈ సమస్య ఇప్పట్లో గాడిన పడే అవకాశం లేదని చెప్పి చేతులు దులుపుకుందని చెవులు కొరుక్కుంటున్నారు.
తప్పక..
ఇక, తప్పని పరిస్థితుల్లో హైకోర్టు ఆదేశించిందని చెబుతూ.. పాతపద్ధతిలో రిజిస్ట్రేషన్స్‌కు పచ్చ జెండా ఊపిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం చేసే ఏ ప్రయత్నానికైనా ప్రజలు తప్పక మద్దతు తెలుపుతారు. అయితే.. తగిన ముందస్తు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది ఈ రిజిస్ట్రేషన్ల వ్యవహారం. మరి.. ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? సమస్యలన్నీ పరిష్కరించి కొత్త పద్ధతిని ప్రవేశపెడుతుందా? ఎందుకొచ్చిన గోల అని వదిలేస్తుందా? అన్నది చూడాలి.