పవన్ పై భారీ ఎత్తున ట్రోలింగ్స్

Update: 2021-04-21 15:30 GMT
తెలంగాణాలో మిని మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మరో ఐదు మున్సిపల్ ఎన్నికలకు ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగబోతోంది. ఖమ్మం కార్పొరేషన్లో జనసేన 12 డివిజన్లలో పోటీకి రెడీ అవుతోంది. ఇప్పటికే 10 డివిజన్లలో నామినేషన్లు కూడా వేసింది. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ బీజేపీతో పొత్తుతోనే సమస్య మొదలైంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్వి హరిప్రసాద్ పేరుతో రిలీజైన ప్రెస్ నోట్ మీదే నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. డైరెక్టుగా పవన్నే చెబుగుడు ఆడేస్తున్నారు. ఎందుకంటే గ్రేటర్ ఎన్నికల సమయంలో తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ మాట్లాడుతూ జనసేనతో తమకు అసలు పొత్తే లేదన్నారు. జనసేనతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎప్పుడు అనుకోలదని స్పష్టంగా చెప్పారు. దాంతో పవన్ పరువంతా పోయినట్లయ్యింది.

ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఈమధ్యనే జరిగిన పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని కాదని టీఆర్ఎస్ అభ్యర్ధి సురభివాణికి ఓట్లేయమని పవన్ స్వయంగా పిలుపిచ్చారు. పవన్ పిలుపుతో జనసేనకు, బీజేపీకి మధ్య తెలంగాణాలో పొత్తు లేదన్న విషయంలో పవనే స్పష్టత ఇచ్చినట్లయ్యింది. పైగా తెలంగాణా కమలంనేతలు మాట్లాడుతూ జనసేనతో పొత్తు ఏపికి మాత్రమే పరిమితమని కూడా చాలాసార్లు చెప్పారు.

ఇదంతా ఇలాగుండగానే తాజాగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 12 డివిజన్లలో పోటీ చేస్తున్నట్లు హరిప్రసాద్ పేరుతో ప్రెస్ రిలీజ్ అవ్వటంపైనే నెటిజన్లు మండిపోతున్నారు. బీజేపీ వద్దని ఛీ కొట్టినా ఇంకా జనసేన సిగ్గులేకుండా కమలంపార్టీతో పొత్తులు పెట్టుకోవటం ఏమిటంటూ మండిపోతున్నారు.

పైగా ’10 డివిజన్లను జనసేనకు ఇప్పటికే కేటాయించిన బీజేపీ’ అని ప్రెస్ నోట్ హెడ్డింగ్ లోనే చెప్పారు. దీన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. పొత్తంటే ఖమ్మంలో మాత్రమే సీట్ల షేరింగ్ ఏమిటి ? మరి మిగిలిన మున్సిపాలిటిల్లో పరిస్ధితి ఏమిటంటు నేరుగా పవన్నే ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే జనసేనతో పొత్తున్నట్లు బీజేపీ నేతలు ఎక్కడా ప్రకటించలేదు. ఈ విషయంలోనే నెటిజన్లు పవన్ను ట్విట్టర్ వేదికగా ఓ ఆటేడుకుంటున్నారు. మరి నెటిజన్ల ప్రశ్నలకు పవన్ సమాధానం చెబుతారా ?
Tags:    

Similar News