పార్ల‌మెంట్‌ పై దాడి చిన్న విష‌యమ‌ట!

Update: 2017-06-07 17:34 GMT
టెహ్రాన్ పార్ల‌మెంట్ భ‌వ‌నంపై జ‌రిగిన ఉగ్ర‌దాడి ప‌ట్ల స్పీక‌ర్ అలీ ల‌రిజానీ స్పందించారు. పార్ల‌మెంట్‌ పై జ‌రిగిన దాడి ఓ చిన్న ఘ‌ట‌న అని ఆయ‌న అన్నారు. దాడిపై ఆయ‌న పార్ల‌మెంట్‌ లో ప్ర‌క‌ట‌న చేశారు. ``ఇది మీకు తెలిసిందే, పిరికిపంద ఉగ్ర‌వాదులు బిల్డింగ్‌లోకి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించారు, వాళ్ల‌ను స‌మ‌ర్థింగా ఎదుర్కున్నాం. ఇదో చిన్న విష‌యం, ఇబ్బందులు సృష్టించేందుకు ఉగ్ర‌వాదులు ప్ర‌య‌త్నిస్తున్నారు` అని స్పీక‌ర్ అలీ అన్నారు. ఉగ్ర గ్రూపుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అడ్డుకుంటూనే ఉన్నామ‌ని కౌంట‌ర్ టెర్ర‌రిజ‌మ్ యూనిట్ పేర్కొంది.

కాగా, ఇరాన్ పార్ల‌మెంట్‌ ను ఇస్లామిక్ క‌న్స‌ల్టేటివ్ అసెంబ్లీ అని పిలుస్తారు. దాన్నే మ‌జ్లీస్ అని కూడా అంటారు. పార్ల‌మెంట్‌లో మొత్తం 290 మంది స‌భ్యులు ఉంటారు. మ‌హిళా స‌భ్యులు కూడా పార్ల‌మెంట్‌లో ఉంటారు. వివిధ మ‌తాల‌కు చెందిన మైనార్టీలు కూడా ఉంటారు. క్రైస్త‌వులు - జొరాస్ట్రియ‌న్లు, యూదు మ‌తాల‌కు చెందిన వ్య‌క్తులు ఇరాన్ పార్ల‌మెంట్‌లో ప్రాతినిధ్యం వ‌హిస్తారు. తాజా దాడిలో కోట్లు ధ‌రించిన ముష్క‌రులు వాటి కింద గ‌న్నులు పెట్టుకుని పార్ల‌మెంట్‌ లోకి ఎంట‌ర్ అయ్యారు. అయితే క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉన్న పార్ల‌మెంట్‌ లోకి ఉగ్ర‌వాదులు ఎలా చొర‌బ‌డ్డారో అర్థం కావ‌డం లేద‌ని నిపుణులు అంటున్నారు. అనేక చెక్‌ పాయింట్లు ఉండే పార్ల‌మెంట్‌ ను ఎలా ఉగ్ర‌వాదులు చేధించారో తెలియ‌డంలేదు.

పార్ల‌మెంట్ బిల్డింగ్‌ కు 25 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఇమామ్ అయోతుల్లా రుహోల్లా కొమేనీ మందిరాన్ని కూడా ఉగ్ర‌వాదులు టార్గెట్ చేశారు. 1979లో షా ప‌రిపాల‌న‌కు చెక్ పెట్టిన కొమేనీ మేటి నేత‌గా ఆవిర్భ‌వించారు. ఇస్లామిక్ రిప‌బ్లిక్ ఫౌండ‌ర్‌ గా కొమేనీ కీర్తిగాంచారు. మొట్ట మొద‌టి సుప్రీమ్ నేత కూడా ఆయ‌నే. విప్ల‌వ నేత‌గా పేరుగాంచిన కొమేనీ దాదాపు ప‌దేళ్లు ఇరాన్‌ ను పాలించారు.

నిజానికి ఇరాన్‌ లో దాడులు జ‌ర‌గ‌డం అరుదు. ఆ దేశంలో షియా ముస్లింల జ‌నాభా ఎక్కువ‌. సున్నీ ఉగ్ర‌వాదుల ప‌ట్ల షియా మిలిట‌రీ సైన్యం క్రూరంగా వ్య‌వ‌హ‌రించింది . ఇస్లామిక్ స్టేట్ లాంటి ఉగ్ర సంస్థ‌ల‌ను షియా వ‌ర్గీయులు వెంటాడుతూనే ఉన్నారు. టెహ్రాన్‌ ను టార్గెట్ చేసిన ఉగ్ర సంస్థ ప‌న్నాగాల‌ను ప‌టాపంచ‌లు చేసిన‌ట్లు గ‌త ఏడాది ఇరాన్ ప్ర‌భుత్వం పేర్కొంది. గ‌త ఏడాది కూడా రంజాన్ మాస స‌మ‌యంలో దాడుల‌కు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. కానీ వాటిని స‌మ‌ర్థంగా ప్ర‌భుత్వం తిప్పికొట్టింది. అయితే ఈ సారి రంజాన్ నెల‌లోనే మ‌ళ్లీ ఉగ్ర‌వాదులు దాడుల‌కు దిగారు. గ‌తంలో 2010లో ఇరాన్‌ లో అతిపెద్ద అటాక్ జ‌రిగింది. సిస్తాన్ ప్రాంతంలో సున్నీ తీవ్ర‌వాదులు దాడి చేశారు. ఆ ఘ‌ట‌న‌లో సుమారు 39 మంది మృతిచెందారు. కుర్దు ద‌ళాలు ఇరాన్ సెక్యూరిటీ ద‌ళాల‌ను ప‌దేప‌దే టార్గెట్ చేస్తూనే ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News