ఒక సినిమా కథకు తీసిపోని మలుపులు ఈ ఉదంతం సొంతం. విన్నంతనే నమ్మేందుకు వీలు కాని అంశాలతో పాటు.. కాస్తంత కన్ఫ్యూజన్ కు గురి చేసేలా ఉండే సున్నిత అంశాలు ఇందులో ఉంటాయి. తాజాగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ఈ కేసు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. ఇలా కూడా జరుగుతుందా? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ఒక పట్టాన జీర్ణించుకోలేని రీతిలో ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే..
ఒక వ్యక్తి తన భార్య మగాడు అని పేర్కొంటూ కోర్టుకు ఎక్కారు. అంతేకాదు.. తనను నమ్మించి పెళ్లి చేసుకొని తీవ్రమైన మానసిక వేదనకు గురి చేసిన ఆమె తండ్రి మీదా.. ఆమె (అతడు) మీదా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దాదాపు ఏడేళ్లుగా సాగుతున్న న్యాయపోరాటం ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది.
మరో వైపు భర్త మీద భార్య పోలీసులకు ఫిర్యాదు చేసి.. కట్నం కోసం తనను క్రూరంగా హింసిస్తున్నారంటూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ ను ఆశ్రయించటం మరో ఎత్తు. 2016లో గ్వాలియర్ కు చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి తర్వాత కొన్ని రోజులకే తన భార్య స్త్రీ కాదని.. ఆమెకు పురుష జననేంద్రియాలు ఉన్నట్లుగా గుర్తించాడు. దీంతో 2017లో మేజిస్ట్రేట్ ను ఆశ్రయించి తన భార్య.. ఆమె తండ్రి మీదా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరాడు. గ్వాలియర్ మెజిస్ట్రేట్ మే 2019లో అతడి కంప్లైంట్ ను పరిగణలోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు తన భర్త కట్నం కోసం హింసిస్తున్నట్లుగా కంప్లైంట్ ఇచచారు. మేజిస్ట్రేట్ ఆదేశాలతో గ్వాలియర్ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇద్దరి వాంగ్మూలాలు రికార్డు చేశారు. అనంతరం ఆమెకు.. ఆమె తండ్రికి సమన్లు జారీ చేశారు. తమకు సమన్లు జారీ కావటాన్ని సవాలు చేస్తే హైకోర్టును ఆశ్రయించారు.
2021 జూన్ లో హైకోర్టు.. భార్యను దోషిగా నిర్ధారించే వైద్య పరమైన సాక్ష్యాధారాలు సరిపోవని స్పష్టం చేస్తూ.. భర్త వాంగ్మూలానికి పెద్దపీట వేయటం సరికాదని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసు సుప్రీంకోర్టుకు చేరుకుంది. తన భార్యకు పురుషాంగంతో పాటు ఆమె కన్నెపొర (హైమెన్) అసంపూర్తిగా ఉందని నిర్ధారించే వైద్య నివేదికను సమర్థించిన తర్వాత ఆమె స్పందనను సుప్రీంకోరింది.
దీనికి స్పందించిన అత్యున్నత న్యాయస్థానం హైమెన్ అసంపూర్ణంగా ఉన్నంత మాత్రాన ఆమె స్త్రీ కాదని చెప్పగలరా? అని ప్రశ్నించింది. వైద్య నివేదిక ప్రకారం ఆమె అండాశయాలు సాధారణంగా ఉన్నాయన్న దాని గురించి ఏం చెబుతారని సవాలు విసిరింది.
దీనికి భర్త తరఫు న్యాయవాది బదులిస్తూ.. ఆమెకు అసంపూర్తి హైమెన్ ఉండటమే కాదు.. పురుషాంగం కూడా ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. పురుషాంగం ఉన్నప్పుడు ఆమెను స్త్రీ ఎలా అవుతుందన్న పాయింట్ పై బలంగా వాదిరంచారు.
ఈ నేపథ్యంలో స్పందించిన ధర్మాసనం మీరేం కోరుకుంటున్నారని భర్త తరఫు లాయర్ ను అడిగింది. తన క్లయింట్ జీవితాన్ని మోసం చేసినందుకు కోర్టులో విచారణ జరగాలని.. ఆమె (అతడు) తన క్లయింట్ మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన విషయాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో ఈ అంశం మీద స్పందించాలని భార్య(అతడు)కు.. ఆమె తండ్రికి నోటీసులు జారీ చేశారు. దాదాపు ఏడేళ్లుగా సాగుతున్న ఈ కేసులో భర్త వేసిన కేసు లెక్క తేలటం ఎప్పుడన్న ప్రశ్న తలెత్తక మానదు.