ఆవేశం అంత మంచిది కాదని ఊరికే అనలేదు. విచక్షణను దెబ్బ తీసే ఆగ్రహంతో తిప్పలు తప్పవు. అశోక్ గజపతిరాజు లాంటి పెద్ద మనిషి ఇమేజ్ ను డ్యామేజ్ చేయటం అంత తేలికైన విషయం కాదు. అందుకు ఎంతో ఓర్పు.. అంతకు మించిన పట్టుదల.. మొండితనం.. తెగింపు కావాలి. ఓర్పు విషయంలో మాన్సాస్ మాజీ ఛైర్ పర్సన్ సంచయితకు తక్కువ మార్కులే పడతాయి. తన బాబాయ్ అశోక్ గజపతి రాజును దెబ్బ తీయాలన్న పట్టుదల మాత్రం చాలా ఎక్కువనే చెప్పాలి.
ఇటీవల కాలంలో వరుస ఎదురుదెబ్బలు తింటున్న సంచయిత తాజాగా మరోసారి తప్పు చేశారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. అశోక్ గజపతిపైన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె..ఒకరి కోసం వంద మందికి వ్యతిరేకం అవుతున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకూ సోషల్ మీడియాలో సంచయిత చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..
‘‘గజపతి అశోక్ బాబాయ్ గారూ.. మీ అన్నగారి పుట్టినరోజున ప్రభుత్వ ఉద్యోగి అయిన మాన్సాస్ ఈవోపైకి సిబ్బందిని రెచ్చగొట్టి పంపారు. ఆయన రక్షణ కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి చర్యలకు మీరు సిగ్గుపడటం లేదా? సిబ్బందిని తప్పుదోవ పట్టించి.. వారిని రెచ్చగొట్టి ఈవో మీదకు పంపారు. మీ రాజకీయ చదరంగానికి మాన్సాస్ విద్యా సంస్థల్ని వేదికగా చేసుకోకండి. తాతగారు పీవీజీ రాజుగారు.. నాన్నగారు అనందగజపతిగారు మాన్సాస్ సంస్థల్ని గొప్పగా తీర్చిదిద్దారు. ఆ వారసత్వాన్ని మీరు ధ్వంసం చేస్తున్నారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉద్యోగులు దాడి చేయటానికి కారణం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. మాన్సాస్ ట్రస్టు ఉద్యోగులకు జీతాల చెల్లింపుకోసం ట్రస్టు ఛైర్మన్ అశోక్ గజపతి రాజు ఆదేశాల మేరకు కరస్పాండెంట్ ప్రొఫెసర్ కేవీఎల్ రాజు చెక్కులు విడుదల చేశారు. అయితే.. ట్రస్టుకు ఈవోగా వ్యవహరిస్తున్న వెంకటేశ్వరరావు మాత్రం చెక్కలు చెల్లుబాటు కాకుండా బ్యాంకుల వద్ద ట్రస్టు డిపాజిట్లపై ఫ్రీజింగ్ విధించారు. దీంతో.. చెల్లింపులు జరగలేదు.
అప్పటివరకు జీతాలు వస్తాయని ఆశగా ఎదురుచూసిన 14 విద్యా సంస్థల ఉద్యోగులు.. సిబ్బంది తీవ్ర నిరాశకు గురయ్యారు. తీవ్ర ఆగ్రహంతో మాన్సాస్ కోట ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వందలాది మంది ఉద్యోగుల జీతాలు రాకుండా అడ్డుకున్న ఈవోను వెనకేసుకు వచ్చి.. జీతాలకు ఓకే చెప్పిన అశోక్ గజపతి రాజుకు వ్యతిరేకంగా పోస్టు పెడితే.. సంచయిత ఇమేజ్ పెరుగుతుందా? తగ్గుతుందా? అన్నది ప్రశ్న. బాబాయ్ ను ఏదోలా విమర్శించాలన్న తపన ఆమెకు మరింత నష్టం కలిగిస్తుందన్న విషయాన్ని సంచయిత ఎప్పటికి గుర్తిస్తారో?అయినా.. ఉద్యోగుల్ని ఊసిగొల్పితే కొద్దిమంది ఆందోళన చేస్తారు కానీ.. అంత భారీగా నిరసన చేశారంటే అక్కడి పరిస్థితిని గుర్తించకుండా..ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈవోను గుడ్డిగా సమర్థిస్తే ఎలా? అన్న ప్రశ్నల్ని పలువురు సంధిస్తున్నారు. బాబాయ్ ను దెబ్బ తీయాలన్న తొందరతో సంచాయిత తప్పుల మీద తప్పులు చేస్తున్నారా? అన్నదిప్పుడు చర్చగా మారింది.