ముందు ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌పైనే టీడీపీ దృష్టి పెట్టిందా?

Update: 2022-07-20 02:30 GMT
వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయా పార్టీలు త‌మ బ‌లాబ‌లాల‌పై అప్పుడే విశ్లేష‌ణలు ప్రారంభిస్తున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే ఎక్క‌డ త‌ప్పులు చేయ‌డం వ‌ల్ల తాము ఓట‌మి పాల‌య్యాం? ఆ త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవ‌డం ఎలా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి అనుస‌రించాల్సిన వ్యూహాలేంటి ఇలా అనేక అంశాల‌పై స‌మీక్ష‌లు నిర్వ‌హించుకుంటున్నాయని అంటున్నారు.

ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి అధికారం సాధించాల‌నుకుంటున్న టీడీపీ ప్ర‌స్తుతం ఈ విశ్లేష‌ణ‌ల్లో మునిగి తేలింద‌ని చెబుతున్నారు.

ముఖ్యంగా టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాలు, గ‌తంలో ఎక్కువ ప‌ర్యాయాలు విజ‌యం సాధించిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఓట‌మి పాల‌వ‌డంపై టీడీపీ ఆత్మ‌విమ‌ర్శ చేసుకుంటున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ప‌లాస, ఆమ‌దాల‌వ‌ల‌స‌, విజ‌యన‌గరం జిల్లాలో శృంగ‌వ‌ర‌పుకోట‌, విశాఖ‌ప‌ట్నం జిల్లాలో మాడుగుల‌, న‌ర్సీప‌ట్నం, తూర్పుగోదావ‌రిలో తుని, ప్ర‌త్తిపాడు, ప‌శ్చిమ గోదావ‌రిలో కొవ్వూరు, త‌ణుకు, దెందులూరు, ఏలూరు, చింత‌ల‌పూడి, కృష్ణా జిల్లాలో నందిగామ‌, మైల‌వ‌రం, విజ‌య‌వాడ సెంట్ర‌ల్, గుంటూరు జిల్లాలో పొన్నూరు, వేమూరు, చిల‌క‌లూరిపేట‌, వినుకొండ‌, క‌ర్నూలు జిల్లాలో నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ‌, డోన్, ప‌త్తికొండ‌, ఆదోని, ఎమ్మిగ‌నూరు, అనంత‌పురంలో రాప్తాడు, పెనుకొండ‌, క‌ల్యాణ‌దుర్గం, తాడిప‌త్రి త‌దిత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అత్యంత బ‌లంగా ఉంద‌ని.. ఇక్క‌డ ఓట‌మిని ఆ పార్టీ జీర్ణించుకోలేక‌పోతోంద‌ని చెబుతున్నారు.

అంతేకాకుండా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టివ‌ర‌కు టీడీపీనే ఎక్కువ‌సార్లు విజ‌యం సాధించింద‌ని ఆ పార్టీ లెక్క‌లేసుకుంటోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి గ‌ట్టి అభ్య‌ర్థులు ఉన్నార‌ని.. ఈసారి ఎలాగైనా ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని గ‌ట్టి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు చెబుతున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ బ‌లంగానే ఉన్న‌ట్టు తేలింద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ముందు టీడీపీ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు, ఖ‌చ్చితంగా గెల‌వ‌గ‌ల‌ద‌నుకున్న నియోజ‌క‌వ‌ర్గాలు, కొంచెం క‌ష్ట‌ప‌డితే గెలుస్తుంద‌నుకునే నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఆ పార్టీ అధిష్టానం లెక్క‌లేసుకుంటోంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టి నుంచే ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న చిన్న చిన్న లోపాల‌ను స‌రిదిద్దుకోవ‌డం, నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌య‌లోపాన్ని అరిక‌ట్ట‌డం వంటి చ‌ర్య‌లకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని అంటున్నారు.
Tags:    

Similar News