జాతీయ రాజకీయాల్లో కేసీయార్ ప్రయత్నాలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అడ్డుపడబోతున్నారా ? నరేంద్రమోడికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని కేసీయార్ చేస్తున్న ప్రయత్నాలకు కేజ్రీవాల్ అడ్డుచక్రం వేసినట్లేనా ?
ఇపుడివే ప్రశ్నలు మొదలయ్యాయి. కారణం ఏమిటంటే ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీని మంచి మెజారిటితో తిరిగి అధికారంలోకి వచ్చింది.
ఇదే సమయంలో పంజాబ్ లో ఘోరంగా ఓడిపోయింది. ఇక్కడ బ్రహ్మాండమైన విజయాలతో ఆప్ అధికారంలోకి వచ్చేసింది. అంటే కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ ఢిల్లీతో పాటు పంజాబ్ లో కూడా అధికారంలో ఉన్నట్లే. ఈ విషయం డెఫనెట్ గా జాతీయ రాజకీయాల్లో కేజ్రీవాల్ కు బాగా కలిసొచ్చేదే. మోడికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న కేసీయార్ ఆశలు, ఆలోచనల మీద ఒక్కసారిగా నీళ్ళు పడినట్లయిపోయింది.
నాలుగురాష్ట్రాల్లో బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవటం అన్నది కచ్చితంగా మోడికి ఎంత బలమిస్తుందో కేసీయార్ ను అంతగా బలహీనుడిని చేస్తుంది. ఇప్పటికే కేసీయార్ ను నమ్మి ఏ ప్రాంతీయపార్టీ ముఖ్యమంత్రులు కూడా చేతులు కలపటంలేదు.
ఇలాంటి స్ధితిలో బీజేపీ గెలుపు సాధించటం కేసీయార్ అంచనాలను తల్లకిందులు చేసేస్తుంది. అయితే కేజ్రీవాల్ క్రేజు మాత్రం అమాంతం పెరిగిపోయినట్లే అనుకోవాలి. ఎందుకంటే పంజాబ్ లో అధికారం అందుకోవటం అంటే మామూలు విషయం కాదు.
అలాగే ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్ లో కూడా కొన్ని సీట్లలో మెరుగైన స్ధితిలోనే ఆప్ అభ్యర్ధులు పోటీఇచ్చారు. ముందు ఢిల్లీ ఇపుడు పంజాబ్ లో కూడా ఆప్ పాగా వేసిందంటే కచ్చితంగా కేజ్రీవాల్ కు ఉన్న క్లీన్ రికార్డనే చెప్పాలి.
మోడికి ప్రత్యామ్నాయ నేతగా జాతీయ రాజకీయాల్లో కేసీయార్ కన్నా కేజ్రీవాల్ ను ఇతర పార్టీల అధినేతలు ఎంపికచేసుకునే అవకాశముంది. మోడికి ప్రత్యామ్నాయంగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలుకంటున్న కేసీయార్ పై కేజ్రీవాల్ నీళ్ళు చల్లినట్లే అనుకోవాలి.