బ్రేకింగ్: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

Update: 2022-03-14 08:08 GMT
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి.  సోమవారం సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు ఆందోళన చేపడుతున్నారు.

 ఏపీలో సంచలనంగా మారిన జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెన్షన్ వేటు వేశారు. మొత్తం ఐదుగురు సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవులు, రామానాయుడు, వీరాంజనేయ స్వామి బడ్జెట్ సెషన్ నుంచి పూర్తిగా సస్పెన్షన్ కు గురయ్యారు.

టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. టీడీపీ సభ్యులను బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్ కు స్పీకర్ ఆదేశించారు. సస్పెండైన సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లాలని కోరారు.

 బడ్జెట్ పై చర్చ జరగకుండా అడ్డుపడుతున్నారు. మీరుండాల్సింది పోడియం దగ్గర కాదని.. మీ స్థానాల్లో అని స్పీకర్ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో ఏపీ అసెంబ్లీలో మరోసారి తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ పొడియం దగ్గర టీడీపీ సభ్యుల ఆందోళనకు దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

తాము అడిగింది ప్రజా సమస్య అని.. దానిపై చర్చించమని అడిగితే సస్పెన్షన్ చేయడం ఎంతవరకూ సమంజసమని స్పీకర్ పోడియం చుట్టుముట్టి తెలుగు దేశం ఎమ్మెల్యేలు నినాదాలు చేయడం ప్రారంభించారు. సస్పెండ్ చేసినా సభ నుంచి ఎమ్మెల్యేలు కదలకపోవడంతో వారిని బయటకు తీసుకెళ్లమని మార్షల్స్ ను స్పీకర్ ఆదేశించారు. ఈ క్రమంలోనే నినాదాల మధ్యనే జంగారెడ్డి గూడెం ఘటనపై మంత్రి ఆళ్ల నాని స్టేట్ మెంట్ ఇచ్చారు.


Tags:    

Similar News