ఏపీకి మంచి రోజులు వస్తున్నాయా. ఎపుడూ ఆదాయం లేదు అని బాధపడే రాష్ట్రానికి ఆ లోటు తీరనుందా. మళ్ళీ పూర్వం మాదిరిగా రియల్ బూమింగ్ కనిపిస్తుందా అంటే ఉందిలే మంచి కాలం అనిపించేలా ఆదాయం ఉంది. మార్చి నెలలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఏపీకి వేయి కోట్లకు పైబడి ఆదాయం వచ్చింది. ఇది నిజంగా రికార్డే అంటున్నారు సంబంధిత శాఖ వర్గాలు.
ఏడాది మొత్తం పదకొండు నెలలు కలిపితే ఈ శాఖకు వచ్చిన ఆదాయం 6,327 కోట్లుగా ఉంటే ఒక్క నెలలోనే ఇంత ఆదాయం రావడం విశేషంగా చెప్పుకోవాలని అంటున్నారు. విభజన తరువాత వేయి కోట్ల మార్క్ ని ఒక నెలలో దాటడం ఇదే ఫస్ట్ టైం అని కూడా చెబుతున్నారు.
విభజన ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం బాగా వర్ధిల్లేది. దాంతో ఆదాయం కూడా పెద్ద ఎత్తున వచ్చేది. ఎపుడైతే ఉమ్మడి ఏపీ రెండు ముక్ఖలు అయిందో ఏపీ వైపు చూడడం తగ్గించారు. ఇక పాలకుల విధానాల మూలంగా కూడా చాలా కాలంగా ఈ వైపు చూసే వారు లేరు.
అయితే ఇపుడిపుడే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తో అది మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఒక్క మార్చి నెలలోనే ఆదాయం గత ఏడాది మార్చి కంటే 35 శాతం ఎక్కువగా నమోదు కావడం బట్టి చూస్తే కొత్త ఏడాది మరింతగా బాగుంటుంది అనే అంటున్నారు.
ఇక కొత్త ఏడాది భూముల విలువను పెంచడంతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచనున్నారు. మరి 2022-23 ఆర్ధిక సంవత్సరం 12 వేలకు పై దాటి ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఆదాయం పెరిగే అతి ముఖ్య శాఖల్లో రిజిస్ట్రేషన్ విభాగం ఒకటి. ఇక్కడ పుంజుకుంటే ఏపీ ఎంతో కొంత గాడిలో పడినట్లే అని ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు.