మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని చూస్తే వైసీపీ నేతలలో ఉక్రోషం బాగా పెరిగిపోతోంది. అనాల్సినవి అన్నీ అయ్యన్న అనేస్తున్నారు. ఆయన వాడే భాష కూడా ఒక్కోసారి హద్దు మీరిపోతోంది. దాన్ని వైసీపీ నేతలు అసలు తట్టుకోలేకపోతున్నారు. మరి ఇన్ని రకాలుగా అనేసిన అయ్యన్నపాత్రుడిని పోలీస్ స్టేషన్ దాకా నడిపించాలనుకుంటే అసలు కుదరడంలేదు. ఎన్ని కేసులు పెట్టుకున్నా అయ్యన్న ప్రతీసారీ స్టేలు తెచ్చుకుంటున్నారు. ఆ మరుసటి రోజే మళ్ళీ నోరు చేస్తున్నారు.
దీంతో అయ్యన్నను ఓడించిన నర్శీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అయితే పూర్తి అసహనంతోనే ఉన్నారు. అయ్యన్న పాత్రుడిని ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పులి అంటున్నారని, నిజానికి ఆయన పిల్లి అని హాట్ కామెంట్స్ చేశారు. నల్లజర్లలో ముఖ్యమంత్రి జగన్ని నానా మాటలు అనేసి తీరా పోలీసులు వస్తే 41 ఏ నోటీసును కూడా తీసుకోవడానికి భయపడిన అయ్యన్న పిల్లి కాక పులి ఎలా అవుతారు అని ఆయన నిలదీశారు.
తన ఇంట్లో బెడ్ రూంలో పిల్లిలా దాక్కున్న అయ్యన్న తన రక్షణ కోసం టీడీపీ కార్యకర్తలను ఇంటికి రప్పించుకున్నారని, కోర్టు నుంచి స్టే తీసుకువచ్చేంతవరకూ ఇంట్లోంచి బయటకు రాని అయ్యన్న పులి అని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. అయ్యన్న పులి అని చెబుతున్న నారా లోకేష్ ఒక పిల్లి అని విమర్శించారు. నర్శీపట్నంలో ఉన్న అయ్యన్న పిల్లిని చూసేందుకు తెలంగాణా నుంచి నారా లోకేష్ పిల్లి వచ్చిందని ఆయన సెటైర్లు వేశారు.
అయ్యన్న ఏం ఘనకార్యం సాధించారని నారా లోకేష్ పరామర్శించారని గణేష్ నిలదీస్తున్నారు. పోలీసులు ఏం పీకుతారు అని అడుగుతున్న లోకేష్ కి అయ్యన్న 41 ఏ నోటీసులు అందుకోలేదన్న సంగతి తెలియదా అని ప్రశ్నించారు. ఒకసారి అరెస్ట్ అయి ధైర్యంగా విచారణను ఎదుర్కోలేని అయ్యన్న డేరింగ్ లీడర్ ఎలా అయ్యారని పెట్ల అంటున్నారు.
నోటి దురుసుతనంతో ఇప్పటిదాకా ఎన్నో కేసులు పెట్టించుకుని వాటి మీద స్టేలు తీసుకున్న అయ్యన్న ఇంకా తన నోటి ధాటినే చూపించాలి అనుకుంటే తాము కూడా అలాగే మాట్లాడుతామని అన్నారు. ఒక ముఖ్యమంత్రిని ఎలా సంభోదించాలో తెలియని అయ్యన్న ఫార్టీ ఇయర్స్ పాలిటిక్స్ అని చెప్పుకోవడం దారుణం అని పెట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
మొత్తానికి చూస్తే అయ్యన్న అరెస్ట్ ఈసారి ఖాయమని వైసీపీ నేతలు అంతా ఎదురుచూసినా అయ్యన్న సేఫ్ గానే బయటపడడంతో ఆ పార్టీ తట్టుకోలేకపోతోంది అని అంటున్నారు. మరో వైపు అయ్యన్న తన విమర్శలను కంటిన్యూ చేయడం కూడా వైసీపీకి తలనొప్పిగా మారుతోంది. మొత్తానికి ఒక్క అయ్యన్న చాలు టోటల్ వైసీపీని కిర్రెక్కించడానికి అన్నట్లుగా సీన్ తయారైంది మరి.