జగన్ సింగిల్ హ్యాండ్ తో మళ్లీ పవర్...?

Update: 2022-03-25 10:03 GMT
ఏపీలో రాజకీయం మారుతోంది అని అంతా అంటున్నారు. నిజంగా చూస్తే కొన్ని నెలలుగా మెల్లగా మొదలైన అధికార పార్టీ మీద వ్యతిరేకత అంతకంతకు పెరుగుతోంది అని విశ్లేషణలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే బడ్జెట్ సమావేశాల ముందు వరకూ అధికార పార్టీ దూకుడు అయితే ఏమీ లేదు. మంత్రులు కొందరు ఎపుడూ మాట్లాడే మాటలు, విపక్షాల మీద విసుర్లతోనే మార్చి మొదటి వారం దాకా కధ నడచింది.

అదే టైంలో విపక్షానికి అద్బుతమైన‌ విజయం ఎక్కడ దక్కింది అంటే అచ్చంగా మూడు రాజధానుల విషయంలోనే. తమ పోరాటం వృధా అవుతుందేమో అని అమరావతి ఉద్యమకారులు కూడా ఒక దశలో అనుకున్న పరిస్థితి ఉంది. ఇక జగన్ మొండిపట్టుదలను చూసిన వారు కూడా మూడు కి అంత మూడ్ ఉందేమో అని అనుమానించారు. ఇక ఏపీలో ప్రధాన పక్షం టీడీపీ కూడా కొంతకాలం పాటు అమరావతి ఊసు తగ్గించేసింది.

మిగిలిన రెండు ప్రాంతాలతో బ్యాలన్స్ చేసుకోవడానికే అదంతా అనుకున్నారు. ఈ సమయంలో హై కోర్టు తుది తీర్పు మాత్రం విపక్షాలను ఎక్కడలేని ఆనందాన్ని ఇచ్చింది.  ఇక చూస్తే  అధికార పక్షం ఫుల్ డిఫెన్స్ లో పడిపోయింది. అలాగే ఇక మీదట  రాజధాని విషయంలో వైసీపీ నేతలు  మూడు అన్న మాట ఎత్తరు అని అంతా అనుకున్నారు. అమరావతితోనే అంతా అని భావించారు.

కానీ అసెంబ్లీలో జగన్ మూడు రాజధానులే తమ అజెండా అని కుండబద్ధలు కొట్టారు. మూడు ఎపుడు చేస్తారు. ఎలా వస్తుంది అన్న ప్రశ్నలు ఒకవైపు ఉంటూండగానే జగన్ మాత్రం నిబ్బరంగా చేసిన ప్రసంగం మాత్రం మిగిలిన రెండు ప్రాంతాలను బాగానే ఆకట్టుకుంది అంటున్నారు. అసలు వైసీపీ ఆలోచన కూడా అదే అంటున్నారు. మూడు రాజధానుల విషయాన్ని ఇలా మెల్లగా ఎన్నికల దాకా తీసుకుపోవడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలి అన్నదే ఎత్తుగడ.

దాంతోనే విపక్షం ఇపుడు కార్నర్ అవుతోంది అంటున్నారు. ఇంతే కాదు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని బడ్జెట్ వేళ జగన్ చెప్పుకున్నారు. మద్యం బ్రాండ్ల విషయంలో కూడా చంద్రబాబు తెచ్చిన బ్రాండ్లే తప్ప తాము కొత్తగా ఏ ఒక్కదాన్నిని అనుమతి ఇవ్వలేదని చెప్పి ఇరకాటంలో పెట్టారు. మొత్తానికి చూస్తే  చాలా కాలం తరువాత అధికార పార్టీ డిఫెన్స్ నుంచి బయటకు వచ్చి అఫెన్స్ ఆడింది. అది కూడా శాసనసభ  వేదికగా చేసుకుని జగన్ ఈసారి ఎక్కువ సేపే మాట్లాడారు.

ప్రభుత్వ విధానం ఏంటి అన్నది పక్కా క్లారిటీగా వివరించారు. అలా కనుక  చూస్తే వైసీపీలో ఇపుడు కొత్త జోష్ కనిపిస్తోంది. బడ్జెట్ సమావేశాల ముందు దాలా డీలా పడిన వారు అంతా జగన్ సింగిల్ హ్యాండ్ తో పవర్ ని మళ్ళీ తెస్తాడు అన్న నమ్మకాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటిదాకా ఒక సినిమా ఇక ముందు మరో సినిమా అని వైసీపీ నేతలు అంటున్నారు అంటే ఆ ధీమా వెనక ఉన్న జగన్ అసలైన ధీమా ఏమిటో కూడా చూడాల్సిందే. ఆయన నమ్ముకున్న జనాలతో ఆయనకు ఉన్న బాండింగ్ కూడా ఇక మీదట  చూడాల్సిందే.
Tags:    

Similar News