అన్న క‌న్నా త‌మ్ముడే విభిన్నం..? ధ‌ర్మాన రాజ‌కీయం

Update: 2022-02-21 16:30 GMT
ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ఒకే ఇంటి నుంచి వ‌చ్చి రాజ‌కీయం చేస్తున్నారు.పేరున్న ధ‌ర్మాన (ఎమ్మెల్యే ధ‌ర్మాన పూర్తి పేరు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు), పేరు తెచ్చుకోవాలి,నిలుపుకోవాలి అని ఆరాటం చెందే ధ‌ర్మాన (డిప్యూటీ సీఎం ధ‌ర్మాన పూర్తి పేరు ధ‌ర్మాన కృష్ణ దాసు)ఇలా ఎవ‌రికి వారే! య‌మునా తీరే! ఏం కాదు రాజ‌కీయం అంటే అలానే ఉండాలి.

అలా ఉంటేనే అది రాజ‌కీయం అని కూడా నిర్థార‌ణ‌కు నోచుకుంటుంది.ఒక‌ప్పుడు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఉమ్మ‌డి రాష్ట్రంలో తిరుగులేని నేత.అయితే ఓ ప్ర‌ముఖ ప‌త్రిక త‌న‌ను డీ ఫేమ్ చేసింద‌ని చెబుతారాయ‌న. లేదంటే ఇంకా తాను రాణించి ఉండేవాడిని అని కూడా అంటారాయ‌న. ఇక మ‌రో వ్య‌క్తి డిప్యూటీ సీఎం దాస‌న్న.ఈయ‌న కూడా ఇప్పుడిప్పుడే రాణిస్తున్నారు. కానీ ఆ రోజు ఆ ప్రముఖ ప‌త్రిక నోరేసుకుప‌డిపోయి రాయించిన రాత‌లు ఇవాళ లేవు క‌నుక దాస‌న్న సేఫ్. కానీ మంత్రి అనుచ‌రులు మాత్రం ఏం రాసినా కూడా అంగీక‌రించే ప‌రిస్థితుల్లో లేరు.

అలా ఎవ్వ‌రు రాసినా తంతాం పొడుస్తాం చంపుతాం అని వార్నింగులు అయితే ఇస్తున్నారు. ఇదే జోరు ఇదే నోరు ఆ రోజు ప్ర‌సాద‌రావు మ‌నుషులుగా చెలామ‌ణి అయిన కొంద‌రు రౌడీలు చూపించారు.

కాల క్ర‌మంలో త‌గ్గిపోయారు.కానీ ఇక్క‌డ పేట పాలిటిక్స్ లో (పేట అంటే న‌రస‌న్న‌పేట అని అర్థం) ధ‌ర్మాన దాస‌న్న అనుచ‌రులు రెచ్చిపోతున్నారు.వీరికి దాస‌న్న చిన్న కొడుకు కృష్ణ చైత‌న్య అండగా ఉంటున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. సెటిల్మెంట్ రాజ‌కీయాలు ల‌క్ష‌ల్లో చేస్తున్నారు..కోట్ల‌లో సంపాదిస్తున్నా రు అన్న‌ది టీడీపీ త‌ర‌ఫు ఆరోప‌ణ.కానీ ఒకే సామాజిక‌వ‌ర్గంకు చెందిన నేత‌లు కావ‌డంతో పెద్ద‌గా ఇక్క‌డ రాజ‌కీయ అంత‌ర్యుద్ధం అయితే లేదు. మాట్లాడేవారు వెల‌మ విమ‌ర్శ‌రించేవారు వెల‌మ ఇంకేం ఎవ్వ‌రు ఏం చేసుకున్నా మ‌రో వ‌ర్గం ఆరోప‌ణ‌ల వ‌ర‌కే ప‌రిమితం అవుతుందే త‌ప్ప ప్ర‌త్యక్ష ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ అయితే చేప‌ట్ట‌ని దాఖ‌లాలే  ఉన్నాయి.ఆ విధంగా టీడీపీ పెద్ద‌లు, ప్ర‌ముఖులు అంతా వెల‌మ సామాజిక వ‌ర్గం వారే కావ‌డంతో ఇక దాస‌న్న‌ను అడ్డుకునే వారే లేరు.కానీ ఇదే స‌మ‌యంలో పేట రాజకీయాల‌పై మ‌న‌సు పారేసుకున్న ప్ర‌సాద‌రావు ఇప్పుడిప్పుడే త‌న హ‌వాను తిరిగి నిరూపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

దీంతో ఇక్కడ ఇంటిపోరు తీవ్రం అయ్యే అవ‌కాశాలే మెండు. అచ్చెన్న సైతం టీడీపీ త‌ర‌ఫున గొంతు వినిపించ‌డం లేదు.మంత్రి అక్ర‌మాల‌పై మాట్లాడ‌డం లేదు. దీంతో అక్క‌డ రౌడీ రాజ్యం రాజ్య‌మేలుతుంద‌న్న ఆరోప‌ణ‌లు విప‌రీతంగా  ఉన్నాయి. వీటిపై అచ్చెన్న మాట్లాడితే ఆ రోజు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుపై ఎర్ర‌న్నాయుడు పోరాడిన విధంగానే ఈయ‌న‌కూ  మంచి పేరు వ‌స్తుంది కానీ ఎందుక‌నో టీడీపీ చీఫ్ మాట్లాడ‌రు..అదే విడ్డూరం! కానీ ఎర్ర‌న్న మాత్రం ఆ రోజు క‌న్నెధార

లీజు వ్య‌వ‌హారాల‌పై గొంతెత్తారు.జ‌గ‌న్ అక్ర‌మ ఆస్తుల‌పై హైకోర్టుకు పోయారు. ఈ విధంగా ఆయ‌న కొంత సాహ‌సం చేశారు కానీ ఆయ‌న సోద‌రులు అచ్చెన్న మాత్రం ఈ పాటి కూడా చేయ‌లేదు.. ఇక చేస్తారో లేదో కూడా చెప్ప‌లేం.
Tags:    

Similar News