పంజాబ్ రాజకీయాల్లో పాతుకుపోయేందుకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మరో బలమైన ఎత్తు వేసింది. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ను రాజ్య సభకు పంపాలని నిర్ణయించింది. దీంతో పంజాజ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం సంభవించినట్లయింది. వాస్తవానికి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా వైదొలుగుతున్న సమయంలోనే భజ్జీ అరంగేట్రం జరుగుతుండడం గమనార్హం. చిత్రమేమంటే.. సిద్ధూ క్రికెటర్ గా రిటైరవుతున్న సమయంలోనే హర్భజన్ సింగ్ కెరీర్ (1998) మొదలైంది. భజ్జీ నాడు టెస్టు ప్లేయర్ గా ఆస్ట్రేలియాపై కెరీర్ ను మొదలెట్టాడు. తర్వాత రెండేళ్లు వెనుకబడినా.. 2001లో ఆస్ట్రేలియా సిరీస్ తో శాశ్వత సభ్యుడిగా మారిపోయాడు.
ఇక సిద్దూ అదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మరోవైపు తాజాగా జరిగిన ఎన్నికల్లో పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమితో పీసీసీ పదవికి సిద్ధూ రాజీనామా చేశాడు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తర్వాత రెండు రోజులకు అతడి రాజీనామా కోరారు. దీన్నిబట్టి రాజీనామా ఆమోదం తథ్యమని తెలిసిపోతోంది. కాగా, ఇప్పుడు భజ్జీ రాకతో పంజాబ్‌లో పొలిటికల్ చైర్ గేమ్ మొదలయినట్లయింది. ఆప్.. దీర్ఘకాల వ్యూహంతోనే భజ్జీని రాజ్య సభకు పంపుతున్నట్లు కనిపిస్తోంది. అతడు గతేడాది క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ, తుది జట్టులో చోటు దొరకడం లేదు.
దీంతో భజ్జీ క్రికెట్ కెరీర్ ముగిసినట్లే. తదుపరి అడుగు రాజకీయాల్లో పడుతోంది. అంటే.. పంజాబ్‌లో ఓ మాజీ క్రికెటర్ పదవి వదులుకుంటే ..మరో మాజీ క్రికెటర్‌కి పదవి దక్కబోతోంది. కాగా, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ మార్పుతో టీమిండియా మాజీ క్రికెటర్ల తలరాతలు మారిపోతున్నాయనే చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ఆప్ విజయం సాధించిన తర్వాత సీఎం అభ్యర్థి భగవంత్‌మాన్‌కు భజ్జీ ట్విట్టర్ ద్వారా కంగ్రాట్స్ చెప్పారు భజ్జీ. దీన్నిబట్టి చూస్తే భజ్జీకి రాజకీయాలంటే ఆసక్తి ఉన్నట్లు స్పష్టమవుతోంది. గతంలో కూడా ఓసారి పంజాబ్‌కు సేవ చేయాలని ఉందని భజ్జీ చెప్పాడు. రాజకీయాల్లోకి రావడం ఖాయమైతే తానే ప్రకటిస్తానని స్పష్టం చేశాడు. అన్ని పార్టీలతోనూ హర్భజన్‌కి మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే గతేడాది డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన భజ్జీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ తరపు నుంచి పోటీ చేయకుండా తటస్థంగా ఉన్నాడు.
భల్లే భల్లే
పంజాబ్‌లో దక్కిన విజయం అనూహ్యం కాదని.. తమ పట్టు నిలుపుకోవాలని ఆప్ ఆలోచనతో ఉంది. గొప్ప క్రికెటర్, సినిమాల్లోనూ సెలబ్రిటీ అయిన హర్భజన్‌ని రాజ్యసభకు పంపిచడం అందులో భాగమే.. భజ్జీని రాజ్యసభకు పంపే విషయంపై తుది నిర్ణయం, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జలంధర్ నగరానికి చెందిన హర్భజన్... 1998 నుంచి 2016 వరకు భారత క్రికెట్ జట్టు సభ్యుడిగా కొనసాగాడు. 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లో 163 మ్యాచ్‌లు ఆడాడు.
సిద్ధూ భవితవ్యమేమిటో?
పంజాబ్ లో ఘోర ఓటమితో సిద్ధూ భవిష్యత్ అంధకారంలో పడింది. వాస్తవానికి 2017లో సిద్ధూ ఆప్ వైపే మొగ్గుచూపాడు. కానీ, కాంగ్రెస్ అతడిని లాక్కుంది. డిప్యూటీ సీఎంను చేసింది. అయితే, సీఎం అమరీందర్ సింగ్ తో విభేదాలు ముదిరి సిద్ధూ రాజీనామా చేశాడు. చివరకు అమరీందర్ ను తప్పించేందుకూ వెనుకాడలేదు. అమరీందర్ కొత్త పార్టీ స్థాపించి, బీజేపీతో కలిసి పోటీ చేశారు. సిద్ధూ పీసీసీ చీఫ్ గా పార్టీని నడిపించారు. వీరంతా తీవ్రంగా దెబ్బతిన్నారు. రెబల్ గా ముద్రపడిన సిద్ధూ భవిష్యత్ కూడా అంధకారంలో పడింది.
యూపీలో కఫీల్ ఖాన్
పంజాబ్ లో ఆప్ ఎత్తుగడ అలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ).. గోరఖ్ పూర్ కు చెందిన వివాదాస్పద పిల్లల వైద్యుడు కఫీల్ ఖాన్ ను ఎమ్మెల్సీని చేయనుంది. నాలుగేళ్ల కిందట గోరఖ్ పూర్ లో పిల్లల అనుమానాస్పద మరణాలు చోటుచేసుకున్నాయి. దీనిపై కఫీల్ ఖాన్ ను అరెస్టు చేశారు. ఈ పరిణామాలు జాతీయ స్థాయిలో సంచలనంగా నిలిచాయి. సీఎం యోగి నియోజకవర్గమైన గోరఖ్ పూర్ కు చెందిన కఫీల్ ఖాన్ ను ఎమ్మెల్సీని చేస్తూ ఎస్పీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.