ఒక కుటుంబం ఏళ్లకు ఏళ్లు టీడీపీనే నమ్ముకుంది. ఒక కుటుంబం ఏళ్లకు ఏళ్లు ప్రజా జీవితంలో ఉంటూ ఉన్నత పదవులు అందుకుంటూ ప్రజాభీష్టం మేరకు పనిచేస్తోంది. ఇంకా చెప్పాలంటే ఊళ్లో ఓ రైస్ మిల్లు, కొద్దిపాటి పొలం ఇవే ఆస్తులుగా ఉన్న ఆ కుటుంబం నుంచి అనూహ్య రీతిలో ఎర్రన్నాయుడు వచ్చారు. లాయరు కాబోయి పొలిటీషియన్ అయ్యారు. కడదాకా ఆయన పార్టీనే నమ్ముకుని బతికారు. కట్టె కాలేదాకా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారు. అత్యంత సాహసోపేతంగా జగన్ అక్రమాస్తుల కేసులపై న్యాయ పోరాటం చేశారు. అలాంటి కుటుంబం మరో పార్టీ మారుతుందా ?
ఇంకా చెప్పాలంటే...
తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. అన్నయ్య ఎర్రన్నాయుడు ఆ రోజులలో గొప్ప బీసీ నేతగా ఎదిగారు. మారుమూల ప్రాంతం నుంచి ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకున్నారు. తరువాత ఆయన ఓ రోడ్డు ప్రమాదంలో అనూహ్య రీతిలో మరణించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో అధినేత చంద్రబాబు ఆ కుటుంబానికి ఎంతగానో అండగా నిలిచారు. ముఖ్యంగా ఎర్రన్న కుమారుడు రామ్మోహన్ నాయుడిని ఎంతగానో ప్రోత్సహించారు. రెండు సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి తిరుగులేని మెజార్టీతో గెలిచేందుకు తెర వెనుక ఎంతగానో కృషి చేశారు.
..................అరెస్టు సరే
ఆరోపణల మాటేంటి జగన్ !
ఓవిధంగా బాబాయి అచ్చెన్న, అధినేత చంద్రబాబు ఇవాళ్టికీ రాముకు అండగా ఉంటూ దేశ రాజకీయాల్లో మరింతగా రాణించాలనే కోరికను వ్యక్తం చేస్తుంటారు. పార్లమెంట్ సెషన్ జరిగే వేళల్లో ఏం మాట్లాడాలో ముందుగానే సబ్జెక్టివ్ రిఫరెన్సులు ఇస్తారు. బాగా మాట్లాడితే వెంటనే కాల్ చేసి రామూను అభినందిస్తారు కూడా! ఇక అచ్చెన్నకు ఆ రోజు కార్మిక శాఖ మంత్రి ని చేశారు. ఆ సందర్భాల్లో ఈఎస్ ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ సర్కారు అధికారంలోకి రాగానే పెను సంచలనం రేపుతూ అచ్చెన్నను అరెస్టు చేయించింది.
పార్టీ వీడరు నో డౌట్ కానీ జగన్ మాత్రం
లాబీయింగ్ చేస్తూనే ఉంటారు.............
ఆ సందర్భంలోనే టీడీపీని వదిలి వచ్చేయాలని, మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ చేశారని ఇవాళ కొందరు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆవిర్భావ వేళ తమ నాయకుడు ఎన్నడూ విధేయతకే ప్రాధాన్యం ఇస్తారు తప్ప! పదవుల కోసం పార్టీలు మారరు అని పదే పదే అంటున్నారు. తమ నాయకుడి వ్యక్తిత్వం రీత్యా కొంత ఆవేశం ఉన్నప్పటికీ నమ్మిన వారిని
ఆదుకోవడంలో ముందుంటారని చెప్పారు వారు.