అంతా ఆశించిన విధంగా పరిణామాలు జరగవు. అన్నీ అనుకున్న విధంగా నెరవేరాలి అన్న నియమమేం లేదు. కొన్ని ఘటనల కారణంగా మార్పులు తప్పవు. దళిత సామాజికవర్గంకు చెందిన అందరినీ ఉంచి తననే ఎందుకు తప్పించారు అన్నది ఆమె బాధ. ఆమె పేరు మేకతోటి సుచరిత.
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన నేత. ఒకప్పుడు ఆమె ఎవ్వరో ఎవ్వరికీ తెలియదు. హోం శాఖ అప్పగించారు జగన్. సముచిత గౌరవమే ఇచ్చారు జగన్. ఉన్నంతలో ఆమె ప్రాధాన్యానికి లోటు లేకుండా చూసుకున్నారు జగన్.
పదవి ఉన్నంత కాలం ఆమె పెద్దగా ప్రభావం చూపలేకపోయారు అన్నది వాస్తవం. ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.అయితే వాటి విశ్లేషణ అన్నది సుచరితే చేసుకుని తీరాలి. ఆమెతో పాటు ఉన్న మంత్రివర్గ సహచరులకు కొనసాగింపునకు ఉన్న కారణాలు కూడా వేరుగా ఉన్నాయి. ఆదిమూలపు సురేశ్ మొదలుకుని ఇంకా చాలా మంది మళ్లీ చోటు దక్కించుకోవడం ఓ విధంగా ఆశ్చర్యమే! ఇప్పుడు ఆమెకు పదవి లేదు.
ఓ విధంగా చెప్పాలంటే మెరుగ నాగార్జునకు పదవి ఇచ్చేందుకే ఆమెను తప్పించారన్న టాక్ కూడా నడుస్తోంది. ఇప్పుడు ఆమె పదవికి గండం వచ్చిన తీరుకు సొంత సామాజిక వర్గ నేతే కారణమయ్యారు అన్న విశ్లేషణ ఒకటి నడుస్తోంది. ఈ దశలో సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పార్టీలో ఉంటాను కానీ ఎమ్మెల్యే పదవి మాత్రం వద్దని చెప్పారు. ఈ మాట ఆమె బిడ్డలతో చెప్పించారు. బుజ్జగించేందుకు వెళ్లిన మోపిదేవి చేతికి రాజీనామా పత్రం అందించారు.
సుచరిత రాజీనామాకు సంబంధించి చాలా వ్యాఖ్యలు నిన్నటి వేళ సోషల్ మీడియాలో వినిపించాయి. పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిందంటే అందుకు కారణం జగన్ రెక్కల కష్టం అని, అందాక మీరెవ్వరో ఎవ్వరికీ తెలియదు అని అయినా ఎంతో పోటీ ఉన్నా సరే హోం మంత్రి పదవి ఇచ్చారని, గౌరవాన్ని నిలబెట్టుకునే పనులే చేయాలని, పార్టీ పరువు తీయొద్దని పదే పదే చాలా మంది విన్నవించారు.
అంతేకాదు పదవుల కోసం కాకుండా ప్రజల కోసం అభివృద్ధి కోసం ఏ రోజైనా మీరు నినదించారా లేదా మగువల రక్షణ కోసం ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారా కేవలం మీ వ్యక్తిగత ఉన్నతి కోసమే ఇంతగా పరితపిస్తున్నారా అని కూడా ప్రశ్నిస్తున్నారు.