దేశంలోనే అత్యంత సంపన్నుడు.. ప్రపంచంలో టాప్ 10 ధనికుల్లో ఒకరిగా రికార్డును క్రియేట్ చేసిన భారత వ్యాపార దిగ్గజం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మనమడు పృథ్వీ ఆకాష్ అంబానీ ఇప్పుడు స్కూల్ కు వెళుతున్నారు. అదేంటి సరిగ్గా రెండేళ్లు కూడా వయసు ఉండదు కదా? అన్న సందేహం కలుగక మానదు. కానీ.. చిన్న వయసులోనే ప్లే స్కూల్ కు పంపటం చాలామంది తల్లిదండ్రులు చేస్తున్నదే. తాజాగా ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ.. కోడలు శ్లోకా మెహతా దంపతుల ముద్దుల కొడుకే ఈ పృథ్వీ ఆకాష్ అంబానీ.
ఈ బుడ్డి అంబానీకి ఇప్పుడు కేవలం 15 నెలలు మాత్రమే. అయినప్పటికీ అతడ్ని ప్లే స్కూల్ కు పంపటం.. సాదాసీదాగా బతికేలా తయారు చేయటంపై అంబానీ కుటుంబం ప్రత్యేకశ్రద్ధ చూపుతోంది. ఇక.. అతడి స్కూలింగ్ విషయానికి వస్తే మలబార్ హిల్ లోని సన్ ఫ్లవర్ స్కూల్ కు పంపాలని ముకేశ్ అంబానీ ఫ్యామిలీ డిసైడ్ చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పృథ్వీ ఆకాష్ అంబానీ తల్లిదండ్రులు కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు.
మరి..అంత పెద్ద అంబానీ మనమడు స్కూల్ కు వెళుతున్నాడన్నప్పుడు అతడి ఆరోగ్యం.. భద్రతకు సంబంధించిన విషయాల మీద ఆ కుటుంబం ఎన్ని ఏర్పాట్లు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు జరిగిపోయాయి. పృథ్వీ అంబానీ సేఫ్ గా.. ఆరోగ్యంగా ఉండేందుకు ఆ పిల్లాడి వెంట ఒక డాక్టర్ ఉంటారు. అంతేకాదు.. అతడి భద్రత కోసం పలువురు భద్రతా సిబ్బంది సాదాసీదా దుస్తులతో ఉంటూ.. ఆ పిల్లాడి వైపు వచ్చే వారి మీద నిఘా పెడుతూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. 2019లో అంబానీ కొడుకు పెళ్లి కాగా.. వారికి తొలి సంతానం 2020 డిసెంబరు 10న పుట్టటం తెలిసిందే. దేశంలోనే అత్యంత సంపన్నుడైన కుటుంబానికి చెందిన వారసుడి స్కూల్ విషయంలో వారు తీసుకుంటున్న జాగ్రత్తలు ఒక ఎత్తు అయితే.. సాదాసీదాగా బతకాలన్న తలంపు చూస్తే అంబానీ ఫ్యామిలీని అభినందించక తప్పదు.