దేశంలో.. ఇక‌, ప‌వ‌ర్ హాలీడే.. ఫ్యూయ‌ల్ హాలీడే.. డైట్ హాలీడే!!

Update: 2022-03-31 05:39 GMT
హాలీడే! అంటే.. ఏంటి? ఉద్యోగులు, విద్యార్థుల‌కు తెలిసిన ప‌దం. హాలీడే ప్ర‌క‌టిస్తే.. అప్ప‌టి వ‌ర‌కు వారు చేస్తున్న ప‌నులు ఆపేసి.. ఎంజాయ్ చేయ‌డం!! ఇదే క‌దా.. ఇప్ప‌టి వ‌ర‌కు హాలీడే అనేది!! కానీ, ఇప్పుడు దేశంలో స‌రికొత్త హాలీడేలు రానున్నాయి! ఇక నుంచి కొత్త కొత్త పేర్ల‌తో హాలీడేలు.. దేశ ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించ‌నున్నాయి., అవే.. ప‌వ‌ర్ హాలీడే.. ఫ్యూయ‌ల్ హాలీడే.. డైట్ హాలీడే! అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం దేశం అత్యంత సంక్లిష్ట ప‌రిస్థితిలో ఉంది. ఇది ప్ర‌జ‌లు చేసుకున్న‌ది కాదు.. పాల‌కులు చేస్తున్న నిర్వాకంతోనే. అందుకే.. ఈ హాలీడేలు పొంచి ఉన్నాయ‌ని అంటున్నారు.

కొన్ని రోజుల కింద‌ట దేశంలో బొగ్గుకు తీవ్ర కొర‌త ఏర్ప‌డింది. దీంతో ఒక్క‌సారిగా దేశం మొత్తం ఉలిక్కి ప‌డింది. దీనికి కార‌ణం.. దిగుమ‌తుల‌పై ఆధార‌ప‌డి.. స్వ‌దేశీ బొగ్గు ఉత్ప‌త్తుల‌ను త‌గ్గించుకోవ‌డం. ప‌లితంగా.. క‌రోనా ఇత‌ర కార‌ణాల‌తో విదేశీ బొగ్గు దిగుమ‌తులు త‌గ్గిపోయి.. దేశంలో ప‌వ‌ర్ ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డింది. దీంతో దేశంలో తీవ్ర బొగ్గు కొర‌త ఏర్ప‌డి.. విద్యుత్ ఉత్ప‌త్తికి ఆటంకం ఏర్ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ విష‌యం కొన్ని రోజుల కింద‌ట దేశంలో సంచ‌ల‌నం రేప‌డం.. రాష్ట్రాల‌న్నీ కేంద్రాన్ని నిందించ‌డం.. హుటాహుటిన కేంద్రం స్పందించ‌డం.. మంత్రులు స్వ‌యంగా బొగ్గు క్షేత్రాల‌కు వెళ్ల‌డం తెలిసిందే.

అయితే.. ఈ ప‌రిస్థితి అక్క‌డితో అయిపోలేదు. ప్ర‌స్తుతం గుజ‌రాత్‌..(ప్ర‌దాని మోడీ సొంత రాష్ట్రం)ను కుదిపేస్తోంది. అక్క‌డ బొగ్గు కొర‌త‌తో.. విద్యుత్ ఉత్ప‌త్తిపై ప్ర‌భావం ప‌డి.. అక్క‌డ విత్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు రోజుకు 5 నుంచి 6 గంట‌ల పాటు కోత‌లు విధించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.  ఈక్ర‌మంలో ఈ ప‌రిస్థితి త‌ట్టుకోలేక‌.. గుజ‌రాత్ ప్ర‌భుత్వం.. ఏకంగా `ప‌వ‌ర్ హాలీడే`ను ప్ర‌క‌టించింది. అంటే.. ప్ర‌భుత్వం నిర్దేశించిన రోజు.. పరిశ్రమలు అన్ని ప‌వ‌ర్ వినియోగానికి దూరంగా ఉండ‌డం అన్న‌మాట‌. ఇదే ప‌రిస్తితి త్వ‌ర‌లోనే దేశ‌వ్యాప్తంగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే.. ప‌లు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే.. విద్యుత్ పొదుపు పాటించాలంటూ. ప్ర‌భుత్వాలే ప్ర‌క‌టించాయి.

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం  రెండు రోజుల కింద‌టే.. విద్యుత్‌ను పొదుపుగా వాడాల‌ని.. ఉద‌యం 6-10, సాయంత్రం 4-10 ఏసీలు వినియోగించ‌రాద‌ని.. కోరుతూ.. ప్ర‌జ‌ల‌కు అభ్య‌ర్థ‌న చేసింది. ఇక‌, ఒడిసా కూడా ఇదే త‌ర‌హాలో ప్ర‌జ‌ల‌కు విన్న‌వించింది. పంజాబ్‌లోనూ క‌రెంటు కోత‌లు ఎక్కువ‌య్యాయి. ఇలా.. దేశ‌వ్యాప్తంగా త్వ‌ర‌లోనే ప‌వ‌ర్ హాలిడే వ‌చ్చినా.. ఆశ్చ‌ర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, రెండోది ఫ్యూయ‌ల్ హాలిడే! ఇప్ప‌టికే దేశంలో చ‌మురు సంక్షోభం దిశ‌గా అడుగులు వేస్తోంది. దేశంలో రోజు రోజుకు చ‌మురు ధ‌ర‌లు పెరుగుతున్నాయి. నిజానికి చ‌మురును స‌మృద్ధిగా నిల్వ చేసుకునేందుకు దేశ‌వ్యాప్తంగా భూగ‌ర్భ ట్యాంకులు ఏర్పాటు చేసుకోవాల‌ని.. రెండు ద‌శాబ్దాల కింద‌టే.. రంగ‌రాజ‌న్ క‌మిటీ కేంద్రానికి సిఫార‌సు చేసింది. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దిశ‌గా ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌లేదు. కేవ‌లం యుద్ధ అవ‌స‌రాల కోసం.. విశాఖ‌, ప‌శ్చిమ బెంగాల్‌లో స‌ముద్ర తీర ప్రాంతాల్లో నిల్వ‌లు చేసుకున్నారు.

వాటిని తీయ‌రు. మ‌రోవైపు.. ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్ర‌భావంతో ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌మురు ధ‌ర‌లు  పెరుగుతున్నాయి. ఈ ప్ర‌భావం దేశంపై ప‌డి.. రోజూ దాదాపు రూపాయి చొప్పున‌(88-89-91 పైస‌లు చొప్పున‌) పెంచుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది మ‌రింత పెరిగితే.. పొరుగున ఉన్న శ్రీలంక‌లో వ‌చ్చిన చ‌మురు సంక్షోభం మ‌న‌కూ వ‌చ్చే అవకాశం ఉంది. దీంతో అప్పుడు దేశంలో ఫ్యూయ‌ల్(చ‌మురు) హాలీడే ప్ర‌క‌టించినా.. ఆశ్చ‌ర్యం లేద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.

మూడోది.. డైట్ హాలీడే! ఇది మ‌న‌కు కొత్త‌కాదు. వినేందుకు ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. లాల్‌బ‌హ‌దూర్ శాస్త్రి ప్ర‌ధానమంత్రిగా ఉన్న‌ప్పు డు.. రెండో ప్ర‌పంచ యుద్ధం వ‌చ్చింది.దీంతో తిండి గింజ‌ల‌కు దేశంలో కొర‌త వ‌చ్చింది. ఆక‌లి చావులు పెరిగిపోయాయి దీనిని గ‌మ‌నించిన శాస్త్రి గారు.. వెంట‌నే దేశంలో డైట్ హాలీడే ప్ర‌క‌టించారు. ప్ర‌తి శ‌నివారం ఒక పూట‌.. ఆహారం మానేసి.. ధాన్యం వినియోగం త‌గ్గించాల‌ని.. ఆ ధాన్యాన్ని పేద‌ల‌కు పంచాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. అప్ప‌టి నుంచి దేశంలో శ‌నివారం ఒక‌పూట అన్నం తినే అల‌వాటు వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు ఆ ప‌రిస్థితి ఎదురైనా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎందుకంటే.. నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. లీట‌రు వంట‌నూనె 200 రూపాయ‌ల‌కు ఎగ‌బాకింది. పెట్రోల్ ధ‌ర‌లు పెరిగి.. నిత్యావ‌స‌ర  ద‌రలు కూడా పెరిగాయి. వీటిని కంట్రోల్ చేయాల్సిన‌ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు .. ప్ర‌జ‌లపై మ‌రిన్ని భారాలు మోపుతున్న ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ దేశంలో డైట్ హాలీడే ప్ర‌క‌టించినా.. ఆశ్చ‌ర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. దేనికైనా.. దేశ ప్ర‌జ‌లు సిద్ధ‌ప‌డాలి.
Tags:    

Similar News