వీడియో : ఆర్‌ఆర్‌ఆర్‌ కి కొత్త అర్థం ఇచ్చి జెండా ఎత్తిన సజ్జనార్‌

Update: 2022-03-16 07:30 GMT
తెలంగాణ ఆర్టీసీకి సోషల్‌ మీడియా ద్వారా విభిన్నమైన పబ్లిసిటీని కల్పిస్తూ లాభాల బాట పట్టించేందుకు గాను ఎండీ వీఎస్ సజ్జనార్‌ విభిన్నంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రెండింగ్‌ అంశాలను తీసుకుని దాంతో ఆర్టీసికి సంబంధించిన విషయాలను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆయన సోషల్‌ మీడియాను ఎంపిక చేయడం జరిగింది. ఈమద్య కాలంలో ప్రతి హిట్‌ సినిమా.. పెద్ద సినిమా ను ఉపయోగించి మీమ్స్ గా క్రియేట్ చేసి ఆర్టీసీకి పబ్లిసిటీ చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం రాధేశ్యామ్‌ హీరో హీరోయిన్స్ ఆర్టీసీ గురించి మాట్లాడుకున్న మీమ్‌ ఒకటి బాగా పాపులర్‌ అయ్యింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా గురించిన చర్చ జరుగుతోంది. దాంతో ఆ సినిమా ను ఉపయోగించుకుని ఆర్టీసీ కి పబ్లిసిటీ చేయాలని ఆయన అనుకున్నాడు. అందుకోసం తాజాగా విడుదల అయిన ఎత్తర జెండా విజువల్స్ ను ఉపయోగించి టీఎస్ ఆర్టీసీ జెండా ఎగుర వేశాడు.

ఇదే సమయంలో ఆర్‌ ఆర్‌ ఆర్‌ కు కొత్త అర్థం ను కూడా సజ్జనార్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రోడ్డు రవాణా అంటూ ఆర్ ఆర్‌ ఆర్‌ ను ప్రకటించి విభిన్నమైన ప్రమోషన్ ను చేయడం తో ఒక వైపు సినిమా గురించి మరో వైపు ఆర్టీసీ గురించి కూడా చర్చ జరిగేలా సజ్జనార్‌ చేయడం జరిగింది. సజ్జనార్‌ షేర్ చేసిన ఎత్తర జెండా రాష్ట్ర రోడ్డు రవాణా ఆర్ ఆర్‌ ఆర్‌ కి మంచి స్పందన దక్కింది.

ఎప్పటిలాగే సజ్జనార్‌ ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఆయన విభిన్నమైన ఆలోచనలతో ఇప్పటికే ఆర్టీకికి మంచి లాభాలు తెచ్చి పెడుతున్నారు అంటూ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహా లో ఆయన ముందుకు వెళ్తే ఖచ్చితంగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీ కాస్తా లాభాలను దక్కించుకుంటుంది అంటూ విశ్లేషకులు మరియు ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గురించిన విషయానికి వస్తే ఈనెల 25వ తారీకున భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేమికులు ఈ సినిమా ను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్‌ షో లకు గాను 1.5 మిలియన్ ల అడ్వాన్స్ బుకింగ్‌ జరిగి సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఓవర్సీస్‌ లో మరియు ఇక్కడ అన్ని చోట్ల కూడా బాహుబలి 2 రికార్డులను ఈ సినిమా బ్రేక్‌ చేస్తుందేమో అనే నమ్మకం ను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.






Tags:    

Similar News