ఉక్రెయిన్ యుద్ధం తీరు మారుతోందా ?

Update: 2022-08-10 09:30 GMT
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మొదలై దాదాపు 5 నెలలు దాటిపోయిన విషయం తెలిసిందే. ఇన్ని నెలలుగా  రష్యా సైన్యంపై ఉక్రెయిన్ యుద్ధం చేస్తోందంటే అందుకు అమెరికా, ఫ్రాన్ప్, జర్మనీ, ఇటలీ లాంటి అనేక దేశాలు అనేక రకాలుగా మద్దతు ఇవ్వబట్టే. ఒకవైపు అమెరికా దాని మాత్రదేశాల మద్దతుతో అత్యంతాధునిక ఆయుధాలతో యుద్ధం చేస్తునే కొత్త రకమైన యుద్ధానికి ఉక్రెయిన్ తెరలేపింది. కొత్తరకం యుద్ధం తీరు ఏమిటంటే గెరిల్లా యుద్ధం.

ఆయుధాలను ప్రయోగించటం ద్వారా ఎక్కడినుండో మరెక్కడో ఉన్న శతృ సైన్యాలపై యుద్ధం చేయటం మామూలే. ఇదే సమయంలో గెరిల్లా యుద్ధానికి కూడా ఉక్రెయిన్ దిగటమే ఆశ్చర్యంగా ఉంది. గెరిల్లా యుద్ధం కూడా ఎప్పటినుండో ఉన్నదే. అయితే ఈ పద్దతిని శతృవులపై మెరుపుదాడులు చేయటానికి మాత్రమే ఉపయోగిస్తారు. సుదీర్ఘకాలం జరిగే యుద్ధాల్లో గెరిల్లా వార్ ఫేర్ అమలుచేయటం కష్టం కాబట్టి ఈ పద్దతిని అమలుచేయరు.

కానీ ఉక్రెయిన్ మాత్రం తమ భూభాగంగాలో ఉన్న రష్యా సైన్యంపై గెరిల్లాయుద్ధానికి దిగేసింది. తమమాత్రంగా ఉన్న రష్యా సైన్యాలపైకి ఉక్రెయిన్ సైన్యం లేదా కొందరు పౌరులు గెరిల్లా యుద్ధం పద్దతిలో దాడులు చేస్తు చంపేస్తున్నారు. గెరిల్లాపద్దతికి ఉక్రెయిన్ పౌరులు విపరీతంగా మద్దతిస్తున్నారు.

రష్యా సైన్యం ఎక్కడెక్కడ బసచేస్తున్నారు ? ఏ భవనంలో ఎంతెంతమంది సైన్యం ఉందనే విషయాన్ని మామూలు పౌరులే ఉక్రెయిన్ సైన్యానికి సమాచారమిస్తున్నారు. ఆ సమాచారం ఆధారంగా రష్యాసైన్యంపై దాడులుచేసి చంపేస్తున్నారు.

మరోవైపు ఉక్రెయిన్లోని పట్టణాలు, నగరాలను ఆక్రమించుకున్న చోట్లంతా రష్యా పాలకులు తమ కరెన్సీ రూబుల్ ను ప్రవేశపెడుతున్నారు. ఆక్రమించుకున్న నగరాలు, పట్టణాల్లో సైన్యాధికారులను పాలనాధికారులుగా రష్యా నియమిస్తోంది. లోకల్ సెల్యూలర్ నెట్ వర్క్ ను నిలిపేసి రష్యా నెట్ వర్క్ ను ప్రవేశపెట్టింది.

ఉక్రెయిన్ టీవీ ఛానళ్ళను నిలిపేసి రష్యన్ ఛానళ్ళను ప్రసారంచేస్తోంది. రష్యా పౌరసత్వం తీసుకున్న ఉక్రెయిన్ పౌరులకు తలా లక్ష రూబుళ్ళు ఇస్తామని రష్యా ప్రకటించింది.
Tags:    

Similar News