ఏపీ మంత్రులలో అవంతి రూటే సెపరేటు. మహిళలను ఉద్దేశించి మాట్లాడినా లేదా విపక్ష నాయకులను ఉద్దేశించి మాట్లాడినా ఆయన స్థాయి వేరు. ఆయన స్థానం కూడా వేరు. ఇప్పటికే కొన్ని ఆడియో టేపులు లీక్ అయినా కూడా ఆయనపై ఇంతవరకూ క్రమశిక్షణ చర్యలు లేవు.
గురువు గంటా శ్రీనును వదిలి తనదైన యాక్షన్ ప్లాన్ తో వైసీపీతో ఆయన జట్టుకట్టారు. కానీ వచ్చే సారి మాత్రం ఆయనకు టికెట్ కూడా లేదనే అంటున్నారు. అప్పుడు మళ్లీ గురువు సాయంతో లాబీయింగ్ జరిపి టీడీపీకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తారా? అన్నది ఇప్పుడొక సంశయాత్మకంగా ఉంది.
ఎందుకంటే అవంతి, గంటా ఇద్దరూ గతంలో టీడీపీ హయాంలో చక్రం తిప్పిన వారే! మామూలుగా కాదు ఓ రేంజ్ లో విశాఖ పాలిటిక్స్ ను ప్రభావితం చేసిన వారే! మరియు చేస్తున్న వారే ! ఇక రానున్న కాలంలో ఆయనకు మళ్లీ రాజకీయ ప్రాధాన్యం ఉండదని తెలుస్తోంది.
మంత్రి పదవి ఉన్నా సాయి రెడ్డి హవా కారణంగా మొన్నటి దాకా చాలా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఆయన తోటి ప్రజాప్రతినిధులను కూడా కలుపుకుని పోరు అన్న వాదన కూడా ఉంది. ముఖ్యంగా సాయిరెడ్డి వ్యూహంలో భాగంగా అవంతి పెద్దగా ఎదగలేకపోయారు. గంటా శ్రీను ను ఇటుగా రానివ్వలేదు సరికదా ఇక్కడున్న అవంతిని కూడా ఎదగనివ్వలేదు సాయిరెడ్డి. ఆ విధంగా ఆ ఇద్దరూ ఇప్పుడు రాజకీయ ఉనికిని కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు.
ఈ దశలో మంత్రి అవంతి మరో మారు వివాదంలో చిక్కుకున్నారు. ఓ కీలక ఫైల్ విషయమై ఆయనకు సంబంధించిన అధికారులు నిన్నటి వేళ సచివాలయంలో తీవ్ర వాగ్వాదానికి దిగారు.దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణాత్మక వైఖరి నెలకొంది. ఓఎస్డీ రమేశ్ కు, అదనపు పీఎస్ కు మధ్య ఘర్షణ నెలకొనడంతో కాసేపు అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
తరువా అక్కడి సిబ్బంది ఇరువురికీ నచ్చజెప్పడంతో శాంతించారు. కాగా అవంతి కానీ ఆయన వర్గీయులు కానీ మొదట్నుంచీ వివాదాలకు తావిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా జనసేనను టార్గెట్ చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు టూరిజం శాఖ మంత్రిగా ఉన్నా ఆ శాఖపై పట్టులేని వ్యక్తిగానే మిగిలిపోయారు.ఈ నేపథ్యంలో వచ్చే క్యాబినెట్ లో ఆయనకు చోటు లేదని తెలుస్తోంది.