విల్ స్మిత్ కూడా అలాంటోడే.. ఎగతాళిపై పాత వీడియోలు వైరల్

Update: 2022-03-31 07:14 GMT
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో తన భార్య గుండు గురించి కామెంట్ చేసిన యాంకర్ కం కమెడియన్ చెంప చెళ్లుమనిపించి వార్తల్లో నిలిచాడు విల్ స్మిత్.  హాలీవుడ్ సినీ నటుడు విల్ స్మిత్ ఆస్కార్ వేడుకలో హాస్యనటుడు క్రిస్ రాక్‌ను చెంపదెబ్బ కొట్టాడం చర్చనీయాంశమైంది. ఈ అనూహ్య ఘటనతో  అందరూ షాక్ అయ్యారు. ఈ సంఘటన ఆస్కార్ 2022 వేడుకల్లో అతిపెద్ద హైలైట్‌లలో ఒకటిగా నిలిచింది.

అయితే విల్  స్మిత్ తన భార్య జాడా పింకెట్ స్మిత్‌ పై కామెంట్ చేసినందుకే హాస్యనటుడిని కొట్టాడు. రాక్ ఆ వేడుకలో విల్ స్మిత్ భార్య గుండుపై హాస్యాస్పదంగా కామెంట్ చేశాడు. అయితే ఆమె గుండుకు గల కారణం ఆమెకు సోకిన వ్యాధి అన్న సంగతి అతడికి తెలియదు.  పింకెట్‌కి వచ్చిన వ్యాధి గురించి స్మిత్ ఇంతకుముందు బహిరంగంగా పేర్కొన్నా కమెడియన్ కామెంట్ చేయడంతో తట్టుకోలేకపోయాడు.

ఎవరిది తప్పు, ఎవరు ఒప్పు అనేదానిపై అందరూ చర్చలు జరుపుతున్నారు. ఈసారి ఇంటర్నెట్ లో దీనిపైనే వైరల్ చేస్తున్నారు.  విల్ స్మిత్ 1991లో బట్టతల మనిషి గురించి సరదాగా మాట్లాడిన పాత వీడియోను తాజాగా వైరల్‌ చేశారు. కమెడియన్ ను విల్ స్మిత్ కొట్టడాన్ని తప్పుపడుతూ అతడు కూడా గతంలో కామెంట్ చేసిన వీడియోలు బయటకు తీస్తున్నారు. తాజాగా విల్ స్మిత్ పాత వీడియోను వైరల్ చేస్తున్నారు.

 క్రిస్ రాక్ ఇటీవల ఆస్కార్ వేడుకల్లో విల్ స్మిత్ భార్య జాడా పింకెట్‌ను సినిమా పాత్రతో పోలుస్తూ ఒక జోక్ పేల్చాడు. అది పెద్ద వేదికపై జరిగింది. వైరల్ అయ్యింది.ఇదే రీతిలో  ది ఆర్సెనియో హాల్ షోలో విల్ స్మిత్ ఎటువంటి కారణం లేకుండా బట్టతల ఉన్న వ్యక్తిని ఎగతాళి చేస్తూ కనిపించాడు. అతని భార్యకు అదే అలోపేసియా వ్యాధి ఉందన్న విషయాన్ని అందులో ఎత్తి చూపారు..

మందికి చెప్పడానికే.. మనం పాటించమా అని విల్ స్మిత్ ను ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.  కెమెరా ముందే ఇలా  విల్‌ ఇంకొకరిని గతంలో ఎగతాళి చేశాడని వీడియోలను చూపిస్తున్నారు.  తాను కమెడియన్ ను కొట్టడంపై విల్ స్మిత్  స్పందించాడు. నటుడిది మిడిమిడి జ్ఞానం అని.. పరుషంగా హేళనగా మాట్లాడినందుకే కొట్టానని తెలిపాడు. విల్ స్మిత్ తన కోపాన్ని కోల్పోయాడని.. ఎందుకంటే అతని కంటే అతని భార్యపై జోక్ పేల్చడంతో తట్టుకోలేక.. ఆమెపై ఉన్న ప్రేమనే బయటవ్యక్తి చెంప పగిలేలా చేసిందని మరికొందరు విల్ స్మిత్ కు మద్దతుగా నిలుస్తున్నారు.
Tags:    

Similar News