ఫార్ములా 2014 వర్కౌట్ అయ్యేనా !

Update: 2022-03-17 09:28 GMT
రానున్న‌వి ఎన్నిక‌ల సంవ‌త్సరాలు.ఒక‌టి కాదు రెండు సంవ‌త్స‌రాలు. రెండేళ్లూ క‌ష్ట ప‌డితే ఎండ‌కు వాన‌కు చ‌లికి త‌లొగ్గ‌క ప‌ట్టించుకోక ప‌నిచేస్తేనే ఫ‌లితాలు.అవి ఎలా ఉన్నా త‌రువాత కాలంలో కూడా మ‌న నాయ‌కులు జ‌నంలో ఉండాల్సిందే.ఇది జ‌గ‌న్ చెప్పిన ఫార్ములా అయితే కాదు ఆయ‌న తండ్రి దివంగ‌త నేత వైఎస్సార్ హ‌యాం నుంచి అమ‌లులో ఉన్న ఫార్ములా.

అధికారంలో ఉన్నా పోయినా కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య నాయ‌కులు లేక‌పోతే వారికి మ‌నుగ‌డ అన్న‌దే ఉండ‌ద‌ని ప‌దే ప‌దే వైఎస్సార్ చెప్పేవారు.ఆ సూత్రంను ఒంట‌బ‌ట్టించుకున్న యువ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అదే బాట‌లో ఆలోచిస్తూ ప్రయాణిస్తూ ఫ‌లితాలు అందుకుంటున్నారు.

ఓ విధంగా త‌న‌కు ఎదురులేద‌ని నిరూపించేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తూ ఉన్నారు కూడా! క‌నుక కొడాలి నాని చెప్పే మాట‌లు అన్నీ సీఎం చెప్పిస్తున్న‌వే ! ఆ పాటి అర్థం చేసుకోక‌పోతే ఎలా అని టీడీపీ అంటోంది. నాని నుంచి కానీ అంబ‌టి నుంచి కానీ ఓ మాట వ‌చ్చిందంటే అది సీఎం స్క్రిప్ట్.. అని కూడా అంటోంది టీడీపీ.

ప్ర‌జాభిప్రాయాన్ని ప్ర‌భావితం చేసే మీడియా క‌న్నా నాని నే బెట‌ర్ అని న‌మ్ముకుంటున్నారు జ‌గ‌న్.ఎందుకంటే నాని ఓ ప్రెస్మీట్ పెడితే వ్యూయ‌ర్ షిప్ అనూహ్యంగా ఉంటుంది.ఎలానూ చంద్ర‌బాబును మ‌రియు చిన‌బాబు అయిన లోకేశ్ ను ఓకే సారి ఏక కాలంలో తిట్టిపోస్తారు క‌నుక ఇక త‌నకు ప‌నేమీ ఉండ‌ద‌ని అంతా నానినే చూసుకుంటారు అన్న భావ‌నలో సీఎం ఉన్నారు. అందుక‌నో ఎందుక‌నో క్యాబినెట్ లో ఎంద‌రు మంత్రులు ఉన్నా, వైసీపీ త‌ర‌ఫున ఇంద‌రు ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ల‌కు స‌బ్జెక్ట్ ఇచ్చి మాట్లాడ‌మ‌న్నా వాళ్లు మాట్లాడ‌రు.

ఇక తాజా వ్యూహంలో భాగంగా త‌మ నాయ‌కుడ్ని ఒంట‌రి చేసి అంతా ఏక‌మై పోరు బాట సాగిస్తున్నార‌ని వైసీపీ నాయ‌కులు అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు.వైసీపీ వ్య‌తిరేక ఓటు గ్రామ స్థాయిలో ఎలా ఉన్నా కూడా ప‌వ‌న్ టీడీపీ క‌లిసి ఉంటే వైసీపీకి చుక్క‌లే అని భావిస్తున్నారు.

అందుకే 2014 మ్యాజిక్ రిపీట్ అయితే ఇక త‌మ గ‌తేం కాను అన్న భావ‌న‌కు కూడా కొంద‌రు వ‌చ్చేశారు. తాము  ఎంత జ‌న‌లో ఉన్నా క‌నీస స్థాయిలో సీఎం త‌ర‌ఫున అభివృద్ధికి నిధుల కేటాయింపు లేక‌పోతే తామేం చేయ‌మ‌ని వీళ్లంతా ఎమ్మెల్యేల ద‌గ్గ‌ర ఎదురుతిరుగుతున్నారు.

జ‌నంలో తిరిగితే క్రేజ్ వ‌స్తుందో రాదో కానీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తే నే క్రేజ్ వ‌స్తుంద‌ని వీళ్లంతా ప‌దే ప‌దే అంటున్నారు. ఇదే స‌మ‌యంలో టీడీపీ పై జ‌నంకు ప్రేమ లేద‌ని అనుకోలేం అని కూడా అధినాయ‌కత్వం ద‌గ్గ‌ర చెప్పిన మాట‌గా ఉంది. ప‌వన్ కూడా ప‌వ‌ర్ఫుల్ లీడర్ అని ఆయ‌న విష‌య‌మై ఏది ప‌డితే అది మాట్లాడ‌డం త‌గ‌ద‌ని కొంద‌రు కాపు నేత‌లు (వైసీపీలో ఉన్న‌) భావిస్తున్నారు.

ఈ ద‌శలో కొంద‌రు ఇక్క‌డున్నా అధికారంలోఉన్నా ఏం ప్ర‌యోజ‌నం లేద‌న్న‌ది కొంద‌రి అంత‌ర్మ‌థ‌నం. అందుకే చాలా మంది వైసీపీ నాయ‌కులు ప‌క్క పార్టీల వైపు తొంగి చూస్తూ 2014 నాటి రిజ‌ల్ట్ రిపీట్ అయితే తాము కూడా ఒడ్డెక్కిపోతాం అని ఆశ‌లు పెంచుకుంటూ ఉన్నారు. ఆ మ్యాజిక్ రావాలంటే ఆ మానియా రావాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే!
Tags:    

Similar News