ష‌ణ్ముఖ వ్యూహంలో జ‌గ‌న్‌కు క‌లిసి వ‌చ్చేది ఎవ‌రు...?

Update: 2022-03-19 00:30 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని గ‌ద్దె దింపేందుకు.. ప‌క్కా వ్యూహాల‌తో ప్ర‌తిప‌క్ష పార్టీలు చ‌క‌చ‌కా పావులు క‌దుపుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ విష‌యం లో ష‌ణ్ముఖ వ్యూహం (ప‌థ‌కాలు.. ఇత‌ర పార్టీల‌ను క‌లుపుకొని పోవ‌డం.. ఓటు బ్యాంకు చీల‌కుండా చేయ‌డం, హామీలు ఇలా)తో జ‌న‌సేన అడుగులు వేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీ వైసీపీ అధినేత ఈ ష‌ణ్ముఖ వ్యూహాన్ని ఎలా అధిగ‌మిస్తారు?  ఎలా ముందుకు సాగుతారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న రంగంలోకి దిగిపోయిన ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డంతో పాటు.. ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు కూడా తాజాగా జ‌గ‌న్ క్లాస్ ఇచ్చారు. ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌జ‌ల్లో ఉండాల్సిందేన‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఆరు మాసాల ముందే.. ప్ర‌తి ఎమ్మెల్యే,ఎంపీ.. మూడు సార్ల‌యినా.. ప్ర‌తి ఇంటికీ వెళ్లి.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను వివ‌రించాల‌ని చెప్పుకొచ్చారు. అంతే కాదు.. పార్టీలో యాక్టివ్‌గా ఉంటేనే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక‌ట్లు ఇస్తామ‌ని  ఆయ‌న క‌రాఖండీగా చెప్పేశారు.

ఇప్ప‌టికే స‌ర్వేలు సాగుతున్నాయ‌ని.. ప్ర‌జ‌ల్లో ఉన్న నేత‌లు, ప్ర‌జ‌లు త‌మ మ‌ధ్య ఉంటున్నార‌నే నేత‌ల‌కు మాత్ర‌మే ప్రాధాన్యం ఉంటుంద‌ని.. ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే.. ఈ వ్యూహం స‌రిపోతుందా?  అనేది ప్ర‌శ్న‌. వాస్త‌వానికి చాలదు. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ పొరుగు సాయాన్ని కూడా తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అంటే.. రాష్ట్ర స‌రిహ‌ద్దుల వెంబ‌డి ఉన్న రాష్ట్రాల అధికార పార్టీల సాయాన్ని కూడా తీసుకుంటార‌ని తెలుస్తోంది. త‌మిళ‌నాడులో స్టాలిన్‌.. జ‌గ‌న్‌కు స్నేహితుడు, అదే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వ్యూహాత్మ‌క స్నేహ‌శీలి. ఇక‌, ఒడిసా సీఎం న‌వీన్ కూడా జ‌గ‌న్‌కు అభిమాని.

ఇదే క్ర‌మం లో ఈ ముగ్గురికి ఏకైక విరోధి.. చంద్ర‌బాబు. ఈ క్ర‌మంలో.. ఈ ముగ్గురు సీఎంలు కూడా జ‌గ‌న్‌కు స‌హ‌క‌రించే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఎందుకంటే.. చంద్ర‌బాబు అధికారం లోకి వ‌స్తే.. ఈ మూడు రాష్ట్రాలతో ఆయ‌న వివాదాలు పెట్టుకుంటార‌నే చ‌ర్చ కూడా ఉంది. సో.. ష‌ణ్ముఖ వ్యూహాన్ని జ‌గ‌న్‌.. ఇలా తిప్పికొట్టే ప్ర‌య‌త్నం చేయొచ్చ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News