ఆవేశం కాదు అచ్చెన్నా.. ఆలోచ‌న ముఖ్యం.. సీనియ‌ర్‌ల సూచ‌న‌..!

Update: 2022-03-13 00:30 GMT
ప్ర‌స్తుతం అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఈ స‌మావేశాలు అధికార పార్టీ వైసీపీ క‌న్నా.. టీడీపీకి అత్యంత కీల‌కం. ఎందుకంటే.. స‌భ‌లో నిల‌క‌డ‌గా కొన‌సాగి.. ఈ రెండున్న‌రేళ్ల కాలంలో వైసీపీ చేసిన త‌ప్పుల‌ను.. ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య ఉన్న గ్యాప్‌ను టీడీపీ ఎత్తి చూపించే ప్ర‌ధాన స‌మ‌యం.

మ‌రో రెండేళ్లలో ఎన్నిక‌లు రానున్నాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీపైనా.. ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో పార్టీనిర్మాణాత్మ‌కంగా ముందుకు సాగి.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే స్థాయిలో ఉండాల‌ని వీరంతా కోరుకుంటున్నారు.

అంటే.. స‌భ‌లో టీడీపీ అనుస‌రించే వ్యూహంపై ప్ర‌జ‌లు వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. అయితే.. దీని కి త‌గిన విధంగా.. పార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. ముఖ్యంగాఆవేశం.. అనాలో చిత విమ‌ర్శ‌లు.. వంటివి చేయ‌డం ద్వారా.. పార్టీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని.. అంటున్నారు.

బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభం రోజున‌.. గ‌వ‌ర్న‌ర్‌ను ఘెరావ్‌చేయ‌డం.. ఆయ‌న‌ను దూషించ‌డం వంటివి సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేశాయి.

గ‌వ‌ర్న‌ర్ ఏం చేశార‌ని.. ఇలా చేశారు? అని ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో అలా చేసి ఉండ‌కుండా ఉంటే బాగుండేద‌ని సీనియ‌ర్లు కూడా అన్నారు. ఇక‌, బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన రోజు కూడా.. ప్ర‌సంగానికి ప‌దే ప‌దే అడ్డు ప‌డ‌డం ద్వారా.. టీడీపీ స‌భ్యులు సాధించింది ఏమీ క‌నిపించ‌లేద‌నే వాద‌న వినిపించింది. స్పీక‌ర్ చెప్పిన‌ట్టుగా.. బ‌డ్జెట్ పై చ‌ర్చ జ‌రిగిన సంద‌ర్భంలో.. ఖ‌చ్చితంగా టీడీపీ స‌భ్యుల‌కు స‌మ‌యం ఇస్తారు. లేదా.. నిబంధ‌న‌ల మేర‌కు చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్టే అవ‌కాశం కూడా ఉంటుంది.

ఇంత చ‌క్క‌ని అవ‌కాశం ఉంచుకుని... ఆది నుంచి యాగీ చేయ‌డం ద్వారా.. టీడీపీ సాధించేది ఏమీ ఉండ‌ద‌ని.. పార్టీ అభిమానులు సైతం చెబుతున్నారు. ఇప్ప‌టికైనా.. అచ్చెన్న సారథ్యంలోని టీడీపీ ఎమ్మెల్యేలు.. ఆలోచించి అడుగులు వేసి.. స‌ర్కారును ఇరుకున పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తే.. భేష్ అని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News