అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష పడడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. దోషులను ఇంత చాకచక్యంగా వేటాడి పట్టుకున్న పోలీసుల తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల తర్వాత ఇండియన్ ముజాహిదీన్, సిమీ వెన్ను విరిచేలా గుజరాత్ నాటి ముఖ్యమంత్రి, నేటి ప్రధాని నరేంద్రమోడీ కృషి ఉందని చెబుతున్నారు.
2008, జులై 26న అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసులో ఐఎం, సిమీ లతో సంబంధం ఉన్న 38మంది దోషులకు ఉరిశిక్ష పడింది. ఈ కేసులో మొత్తం 49మంది నిందితులను అహ్మదాబాద్ లోని ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. వీరితో పాటు 11 మంది దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ 11 మంది బతికి ఉన్నంత కాలం జైల్లోనే ఉంటారు. వరుస పేలుళ్లలో 56 మంది మృతి చెందగా.. 250 మందికి పైగా గాయపడ్డారు.
పేలుడు జరిగిన మరుసటి రోజే ముఖ్యమంత్రి హోదా రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో నాటి గుజరాత్ సీఎం మోడీ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.ఆలస్యం చేయకుండా విషయాన్ని త్వరగా తేల్చాలని పోలీసులను ఆదేశించారు. గుజరాత్ పోలీసులు కేసును ఛేధిస్తే అది గుజరాత్ కే కాదు..దేశానికి చేసిన గొప్ప సేవ అని మోడీ వారికి సూచించారు.
ప్రతిరోజు మోడీ దీని దర్యాప్తును సమీక్షించారు. 20 రోజుల్లోనే ఈ వ్యవహారం కుట్రకు తెరపడింది. ఆగస్టు 16న గుజరాత్ పోలీసులు ఈ విషయంలో విలేకరుల సమావేశం నిర్వహించి కుట్రలను వివరించారు. ఇండియన్ ముజాహిదీన్ తో సంబంధమున్న ఉగ్రవాదులు ఐఎస్ఐ సూచన మేరకు ఈ కుట్రకు ఎలా పాల్పడ్దారనేది విచారణలో తేలింది.
ఈ ఘటన మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, కేరళ నుంచి పాకిస్తాన్ కు వ్యాపించినట్లు తేల్చారు. ఈ ఘటనపై విచారణ సందర్భంగా ఢిల్లీకి చెందిన బాట్లా హౌస్ కూడా వెలుగులోకి వచ్చింది. గుజరాత్ పోలీసులు ఢిల్లీ పోలీసులకు నాయకత్వం వహించారు. దాని ఆధారంగా దుండగుల వేట జరిగింది. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల వెనుక కుట్రను వెలికితీసేంత వరకూ ఇది గుజరాత్ పోలీసు కీలక అధికారులు చేసిన కృషి ఫలించింది.
ఈ ఘటనకు సంబంధించి నాడు మొదటి లీడ్ అందించింది నాటి వడోదర పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా. సిమీ చేసిందని.. కొంతమంది సభ్యుల ప్రమేయాన్ని ఆయన గుర్తించారు.