ఏపీ సర్కారు చేసిన పొరపాటు ఏంటి?

Update: 2022-10-16 02:30 GMT
ఔను.. ఇది నిజం. పాల‌కుల విజ‌న్‌పై  ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం ఉండాలి. ఇది ఏమాత్రం బెసికినా.. ఇక‌, ఎప్ప‌టి కీ.. ముద్ర చెరిగిపోదు. గ‌తంలో చంద్ర‌బాబు.. చేసింది ఏంటి?  మైక్రోసాఫ్ట్ అనే ఒక అంత‌ర్జాతీయ కంపెనీ ని తీసుకువ‌చ్చి హైద‌రాబాద్ లో పెట్టారు. అంతే.. వెంట‌నే ఆయ‌న‌కు విజ‌న్ ఉన్న నాయ‌కుడు గా ముద్ర ప‌డింది. ఇది ఎంత‌గా అంటే.. ఆయ‌న త‌ర్వాత‌.. ఏం చేసినా..చేయ‌క‌పోయినా.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. నిజానికి ఆయ‌న 14 ఏళ్లు పాలించిన ముఖ్యమంత్రి.. కానీ, రాష్ట్రం అనుకున్న విధంగా అభివృద్ధి చెంద‌లేదు.

ఇది నిష్టుర స‌త్యం. కానీ, ఆదిలో ఆయ‌న వేసిన ఒకే ఒక్క అడుగు ఆయ‌న‌పై విశ్వ‌స‌నీయ‌త‌ను.. విజ‌న్‌ను పెంచింది. మ‌రి.. ఇలా.. ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌పై ఒక్క‌టంటే ఒక్క‌టి విజ‌న్ ప‌డిందా ? ప్ర‌జ‌ల మ‌నసుల‌ను ఆయ‌న ఈ రూపంలో చూర‌గొన్నారా? అంటే..లేద‌నే చెప్పాలి. ఎందుకంటే.. ఆయ‌నపై హోప్స్ పెట్టుకు న్న వారికి కూడా.. ఆయ‌నపై ఇప్పుడున‌మ్మ‌కం స‌న్న‌గిల్లింది. యువ‌కుడు, ఉత్సాహ‌వంతుడు.. త‌న వ్యాపారాల‌ను అభివృద్ధిలో న‌డిపించుకుంటున్నాడు.. సో.. ఏపీని కూడా అలానే ముందుకు తీసుకు వెళ్తాడ‌ని అనుకున్నారు.

కానీ, ఇప్ప‌టికి మూడేళ్లు  అయినా.. ఒక్క సంచ‌ల‌న కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న చేప‌ట్టింది లేదు. దేశంలో ఏపీ ని ముందు వ‌రుస‌లో నిల‌బెట్టింది లేదు. కేవ‌లం సంక్షేమం అమ‌లు చేస్తున్నారు అంతే! ఇది ఎవ‌రైనా చేయ‌గ‌ల‌రు. అప్పులు చేసి.. సంక్షేమం అమ‌లు చేయ‌డం.. విజ‌న్ కింద‌కు రాదు. పైగా.. ప్ర‌పంచ దేశాలు కూడా ఆక్షేపిస్తున్న ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌పై విశ్వాసం పెర‌గ‌డం లేదు స‌రిక‌దా.. అస‌లు.. ఆయ‌న‌పైఅనుమానాలు కూడా వ‌స్తున్నాయి.
 
ఉన్న‌ది పంచ‌డం కాదు.. కొత్త‌ది సృష్టించ‌డ‌మే.. పారిశ్రామిక వేత్త‌ల ల‌క్ష‌ణం. ఇప్పుడు ఏపీని పారిశ్రామికం గా జ‌గ‌న్ ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకువెళ్లిన ప‌రిస్థితి లేదు.పైగా.. ఉపాధి మృగ్య‌మై పోయింది. మ‌రోవైపు.. అప్పులు పెరిగిపోతున్నాయి. వాస్త‌వానికి జ‌గ‌న్ కు ఉన్న పారిశ్ర‌మ‌లు కావొచ్చు.. వ్యాపారాలు కావొచ్చు.. ఇలా అప్పుల కుప్ప‌లు చేసుకుంటున్నారా? అనేది మేధావుల మాట‌. ఆయ‌న వ్యాపారాలు ఆర్థికంగా నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే.. ఏపీని మాత్రం అప్పులు చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌పై న‌మ్మ‌కం కుద‌ర‌డం లేద‌ని అంటున్నారు.

    

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Tags:    

Similar News