ఏపీ సీఎం జగన్.. ఎన్నికలకు ముందు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారి వారినియోజకవర్గాల్లో గడపగడపకు తిరగాలని నిర్దేశించారు. నిజానికి 2019 ఎన్నిక లకు రెండేళ్ల ముందు కూడా ఇలానే ఆయన స్వయంగా పాదయాత్ర చేశారు. ప్రతి ఒక్కరినీ కలిసే ప్రయ త్నం చేశారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా.. తనలక్ష్యాన్ని సాధించారు. కానీ, ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారు. అయినప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో ఉండే పోటీని.. ముందుగానే అంచనా వేసిన..జగన్.. తన నేతలను రంగంలోకి దింపాలని నిర్నయించుకున్నారు.
ఈ క్రమంలోనే పార్టీ ఎమ్మెల్యేలను ఇంటింటికీ తిరగాలని... ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ విషయాన్ని జగన్.. పదే పదే చెప్పారు. ఇప్పటి వరకు ఏదో జరిగిపోయిం ది. కానీ, ఇక మీదట ఇలా ఉండడానికి వీల్లేదనినొక్కి చెప్పారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంటింటికీ తిరిగి.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. అంతేకాదు.. ఒక్కొక్క ఎమ్మెల్యే ఎన్నికలకు ఆరుమాసాల ముందుగానే... ప్రతి ఇంటికీ మూడు సార్లు వెళ్లాలని.. కూడా చెప్పారు.
ఈ క్రమంలో తాను ఇచ్చే లేఖను ప్రజలకు అందించి.. వారి అభిప్రాయాన్ని కూడా సేకరించాలని ఆదేశిం చారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో తాము ఎలాంటి అభివృద్ధి చేస్తున్నామో.. ప్రజలకు వివరించాలని అన్నారు. దీంతో ఎమ్మెల్యేలు కూడా ప్రమోట్ అవుతారని.. వైసీపీపీ కేడర్, వైసీపీ ఎమ్మెల్యే మనుషులు కూడా కథలు కథలుగా చెబుతున్నారు.అయితే.. ఇక్కడ ఒక ధర్మ సందేహం తెరమీదికి వచ్చింది. ఎమ్మెల్యేలు కదా ప్రజలకు వివరించాలి. మేం మీకు అది చేశాం.. ఇది తెచ్చాం.. ఇలా చేశాం.. అలా చేశాం.. అని! అదేవిధంగా ఇంకా చేయాల్సిన అభివృద్ధిపనులపై మీ ఊరికి అది తెచ్చాం.. ఇది తెచ్చాం అని!
కానీ, ఇక్కడ స్వయంగా జగన్ ఇచ్చే లెటర్‌ను ప్రజల చేతుల్లో పెడితే... ఎమ్మెలయే ఏం చేసినట్టు? అనే ప్రశ్న కేడర్‌లోనే వస్తోంది. ఇక, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు... అభివృద్ధి పథకాలు.. సామాజిక పింఛన్లు వంటివి ఎవరికైనా వస్తాయి. కానీ, ఇప్పుడు ప్రధాన సమస్య.. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు. అదేసమయంలో సుదీర్గ కాలంగా ఉన్న సమస్యలు కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. దీంతో ఆయా సమస్యల మాటేంటని వారు ప్రశ్నిస్తారు. మరి దీనికి ఎలాంటి సమాధానం చెప్పాలనేది మరో ప్రధాన చర్చగా మారింది.
ఇదిలావుంటే, గ్రామాల్లో సచివాలయాలు కట్టించారు. జగన్ సర్కారు వచ్చిన తర్వాత.. గ్రామ, వార్డు సచివాలయాల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే.. వీటిని కట్టిన వారికి ఇప్పటికీ.. డబ్బులు రాలేదు. కొందరికి ఫస్ట్ బిల్లులు, మరికొందరికి సెకండ్ బిల్లులు వచ్చాయని అంటున్నారు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? అని రేపు ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్తే.. ప్రశ్నించే అవకాశం మెండుగా ఉంది. ఇప్పటికే గ్రామాల్లో ఈ విషయంలపై ఏదో ఒకటి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. మరి దీనిపైనా సీఎం జగన్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
మరోవైపు.. ముఖ్యమంత్రి ఇచ్చిన లెటర్‌లు ప్రజలకు ఇవ్వడానికి వలంటీర్లు చాలు కదా.. ఎమ్మెల్యేలు ఎందుకు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే.. ఇపప్పటి వరకు ప్రభుత్వం ఏం చేసినా.. ప్రజలకు వివరించేందుకు.. చెత్త పన్ను నుంచి ఇతరపనుల వరకు అన్నింటికీ.. వలంటీర్లనే వినియో గించు కుంటున్నారు కదా! మరి అలాంటప్పుడు.. వలంటీర్లతోనే ఈ లేఖలు ప్రజలకు చేరువ చేస్తే.. బాగుంటుందని... ఎమ్మెల్యేల ఆఫీసుల్లోనే చర్చ జరుగుతోంది. ``ప్రతి విషయాన్నీ.. వలంటీర్లకే అప్పగించారు. ఇప్పుడు మాత్రం మేం ఎందుకు? వాళ్ల చేతికే ఈ లేఖలు కూడా ఇచ్చేస్తే సరిపోతుంది కదా!`` అని కొందరు ఎమ్మెల్యేలు.. గుసగుసలాడుతున్నారు.