ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచే టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ ల పర్వం మొదలైన సంగతి తెలిసిందే. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతలడం, సభలో పేపర్లు చింపి విసిరేయడం, స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి వెల్ లోకి దూసుకెళ్లడం వంటి ఘటనల నేపథ్యంలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడుతూ వస్తోంది. ఇక, జంగారెడ్డి గూడెం ఘటనపై చర్చకు పట్టుబడుతూ సభకు ఆటంకం కలిగిస్తున్నారన్న కారణంతో ఈ రోజు కూడా 11 మంది టీడీపీ సభ్యులపై వేటు పడింది.
సభ అన్నాక సస్పెన్షన్ లు వేయడం, బాయ్ కాట్ చేయడం కామన్. కానీ, టీడీపీ సభ్యులను టార్గెట్ చేస్తూ వైసీపీ సభ్యులు మునుపెన్నడూ లేని విధంగా కొత్త ట్రెండ్ క్రియేట్ చేయడం చర్చనీయాంశమైంది. స్పీకర్ పోడియానికి ముందు గ్రీన్, వైట్, రెడ్ లైన్లంటూ టీడీపీ సభ్యులకు లక్ష్మణ రేఖలు విధించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ గీత దాటితే చాటు ఆటోమేటిక్ గా టీడీపీ సభ్యులు సభ నుంచి సస్పెండ్ అవుతారంటూ చెప్పడం చర్చకు దారి తీసింది.
వాస్తవానికి గతంంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు వైసీపీ సభ్యులు ఏకంగా ఏడాదిన్నరపాటు సభనే బాయ్ కాట్ చేశారు. తమకు మైక్ ఇవ్వడం లేదన్న సాకు చూపి...అసెంబ్లీపైనే అలిగి ప్రజా సమస్యలను గాలికొదిలేశారన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. సభకు వైసీపీ సభ్యులు వెళ్లిన కొద్ది రోజుల్లో...వారిపై ఆనాటి స్పీకర్ కోడెల కూడా సస్పెన్షన్ అస్త్రంతోపాటు, మైక్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని, రోజాపై సుదీర్ఘ కాలం సస్పెన్షన్ వేటు వేయడం వంటివి చేశారని వైసీపీ నేతలు విమర్శిస్తుంటారు.
ఇక, తాజా పరిణామాలు చూస్తుంటే... టీడీపీ సభ్యులపై వైసీపీ రివేంజ్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు సభలో అడుగుపెట్టబోనని చాలెంజ్ చేసిన నేపథ్యంలో మిగతా సభ్యులు మాత్రం సభకు వచ్చి ప్రజాసమస్యలపై పోరాడతామంటున్నారు. కానీ, టీడీపీ సభ్యులకు మైక్ ఇవ్వడానికి కూడా స్పీకర్ ఇష్టపడడం లేదని, విపక్ష సభ్యులకు కనీస మర్యాద ఇవ్వడం లేదని, గొంతెత్తితే చాలు సస్పెన్షన్ వేటు వేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
టీడీపీ సభ్యుల తీరును ప్రజలు గమనిస్తున్నారని తమ్మినేని పదే పదే అంటున్నారు. నిజమే, సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల తీరుతో పాటు స్పీకర్ తీరునూ ప్రజలు కచ్చితంగా గమనిస్తున్నారు. జగన్ సుధీర్ఘ ప్రసంగాలు, జగన్ ప్రసంగాలకు వైసీపీ సభ్యుల ప్రశంసలు, చప్పట్లు ...ఇవి మాత్రమే ఉంటే సభ రక్తికట్టదు. అధికార పక్ష సభ్యులకు దీటుగా ప్రతిపక్ష సభ్యులు కూడా సమాధానం చెబుతుంటేనే ప్రజా సమస్యలు సభలో ప్రస్తావనకు వస్తాయి.
సభలో ప్రతిపక్ష సభ్యులకూ మాట్లాడే అవకాశమిస్తానని చెప్పిన జగన్ ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది. అదే సమయంలో టీడీపీ సభ్యులు కూడా కాస్తంత ఓపికగా ఉండి...ఇంకాస్త హుందాగా ప్రవర్తించి ప్రజా సమస్యలపైనే మాట్లాడడానికి ప్రయత్నిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్పీకర్ మనోడే కదా అని ఈ రోజు అధికార పక్షం తమ మాటే చెల్లుబాటు కావాలని చూస్తే...ఈ సంస్కృతి ఇలాగే కొనసాగుతుందనడంల ో ఎటువంటి సందేహం లేదు.
నిన్న టీడీపీ, నేడు వైసీపీ, రేపు మరోపార్టీ...పార్టీలు మారినా, సభ్యులు మారినా, స్పీకర్ మారినా...సభ మారదు, సంప్రదాయం మారదు అన్నవిషయాన్ని సభ్యులంతా గుర్తెరిగి సభా మర్యాదను కాపాడితేనే భావితరాల వారు అసలు సిసలు అసెంబ్లీ సమావేశాలు అంటే ఏమిటో చూడగలుగుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. అసెంబ్లీ సమావేశాలంటే...చేపల మార్కెట్ అనే ప్రస్తుత తరం యువత భావనను తొలగించాలంటే సభ్యులందరూ హుందాగా ప్రవర్తించక తప్పదు.