ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్టు దించామా? లేదా? ‘‘పోకిరి’’ సినిమాలోని ఈ డైలాగ్ ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే. దీనిని క్రికెట్ లోకి అనువదిస్తే, అందులోనూ టెస్టు క్రికెట్ కు వర్తింపజేస్తే.. ఈ కథ భలే మజాగా ఉంటుంది. మూడు ఫార్మాట్లలోనూ టెస్టు క్రికెట్ అంటే ఉండే ఆ అనుభూతే వేరు. సంప్రదాయ బౌలింగ్, అందుకుతగ్గట్లు ఫీల్డింగ్ సెట్టింగ్, బ్యాట్స్ మెన్ బ్యాటింగ్.. టెస్టు క్రికెట్ ను మళ్లీమళ్లీ చూడాలనిపిస్తాయి.
అందుకే.. గావస్కర్ నుంచి కోహ్లి వరకు వయా టెండూల్కర్ అందరూ చెప్పేదొకటే మాట.. ‘‘టెస్టు క్రికెట్ ఎప్పటికీ సజీవం’’ అని. ఇక సమఉజ్జీలైన జట్ల మధ్య మ్యాచ్ అంటే చెప్పేదేముంది? ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా-భారత్, ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా, భారత్-ఇంగ్లాండ్ ఇలా.. మనం చూసిన రసవత్తర పోరాటాలెన్నో.
బౌలర్లే కీలకం..
టెస్టులు గెలవడం అంత ఈజీ కాదు. బ్యాట్స్ మెన్ ను రెండు సార్లు ఔట్ చేసే దమ్మున్న బౌలర్లు ఉంటేనే ఈ ఫార్మాట్ లో విజయం సాధ్యం. ఏ కెప్టెనయినా చెప్పే మాటే ఇది. లేదంటే మ్యాచ్ నిస్సారమైన డ్రాగా ముగిసిపోతుంది. మరోవైపు పిచ్ లూ కొంత ముఖ్యమేననుకోండి.
అలాంటి పిచ్ ల మీదా వికెట్లు తీసే బౌలర్లు ఉండాలి అనేది ఇక్కడ ప్రధానాంశం. ఉదాహరణకు పాకిస్థాన్- ఆస్ట్రేలియా మధ్య మంగళవారం ముగిసిన టెస్టు మ్యాచ్ ను చూడండి. పేలవమైన డ్రాగా ముగిసింది. ఇక్కడ పిచ్ నిర్జీవంగా ఉంది. మేటి బౌలర్లు రెండు జట్లలోనూ ఉన్నా.. ఏమీ చేయలేకపోయారు. నాలుగో ఇన్నింగ్స్ సాగనే లేదు. ఇక భారత్-శ్రీలంక మధ్య మొహాలీలో ముగిసిన టెస్టు మాత్రం రెండున్నర రోజుల్లోనే ముగిసింది.
ఇక్కడ చెప్పుకోవాల్సింది బౌలర్ల ప్రతిభ. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా ఏకంగా 175 పరుగులు చేయడమే కాక.. 9 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ 6 వికెట్లు తీశాడు. పేసర్లు బుమ్రా, షమీ వికెట్లు పడగొట్టినా ఆఫ్ స్పిన్నరయిన జయంత్ యాదవ్ ఒక్క
వికెటూ తీయలేకపోయాడు.
అసలు విషయానికొస్తే..
టెస్టు మ్యాచ్ లో అత్యధిక వికెట్లు తీసిన వీరులంతా సహజంగానే తమ జట్ల గెలుపులో భాగమవుతుంటారు. ఇటీవల మరణించిన స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ వరకు ఈ జాబితాలో ఉన్నవారే. ఇలా చూస్తే 1960-70ల్లో భారత స్పిన్ త్రయం ప్రసన్న, బేడీ, చంద్రశేఖర్, 2000వ దశకంలో కుంబ్లే, హర్భజన్ చాలామంది ఉన్నారు.
తమ బౌలింగ్‌తో మ్యాచ్ ఫలితాలనే మార్చారు వీరు. మ్యాచ్‌లు ఓడినప్పటికీ బౌలర్లు మాత్రం అద్భుతంగా ఆడిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. అయితే బౌలర్లు ఎన్ని వికెట్లు తీసినా జట్టు గెలిచిందా? లేదా? అనే చూస్తారు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో మేటిగా నిలిచిన ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీశారు? జట్టు విజయంలో ఎంత
భాగస్వామ్యమయ్యారో చూస్తే..?
వార్న్ అగ్రస్థానంలో..
షేన్ వార్న్ 145 టెస్ట్లులు ఆడి708 వికెట్లు తీయగా.. 510 వికెట్లు ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాయి. ఆస్ట్రేలియా గెలిచిన మ్యాచ్‌ల్లో షేన్ వార్న్ తీసిన వికెట్లు ఇవి. మిగతా 198 వికెట్లు తీసినప్పుడు ఆస్ట్రేలియా ఓడిపోయంది. శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 133 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 800 వికెట్లు తీశాడు. ఇందులోని 448 వికెట్లు శ్రీలంకకు విజయాన్ని అందించాయి. ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ తీసిన 414 వికెట్లు వారి జట్టుకు విజయాన్ని అందించాయి.
124 టెస్టు మ్యాచ్‌లు ఆడిన గ్లెన్ మెక్‌గ్రాత్ 563 వికెట్లు తీశాడు. నాలుగో స్థానంలో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఉన్నాడు. ఇప్పటికీ ఆడుతున్న ఇతడు.. 169 టెస్ట్ మ్యాచ్‌లలో 640 వికెట్లు తీశాడు. ఇందులో ఇంగ్లండ్ విజయానికి 338 వికెట్లు మాత్రమే ఉపయోగపడ్డాయి. దక్షిణాఫ్రికా పేస్ లెజెండ్ డేల్ స్టెయిన్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. కెరీర్లో 93 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 439 వికెట్లు తీశాడు. ఇందులో 305 వికెట్లు సౌతాఫ్రికాకు విజయాన్ని అందించాయి.
మన అశ్విన్‌కు ఎన్నంటే
ఆరో స్థానంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. 85 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 436 వికెట్లు తీశాడు. ఇందులో 304 వికెట్లు భారత్ విజయానికి దోహదపడ్డాయి. ఈ టాప్ 6 జాబితాలోని ఆటగాళ్లలో అండర్సన్, అశ్విన్ మాత్రమే టెస్టులు ఆడుతున్నారు.