ఆయన వైసీపీకి రాజకీయ ప్రత్యర్ధి కాదు, వైఎస్సార్ ఇంటి అల్లుడు. వైసీపీ అధినాయకుడు జగన్ కి స్వయాన బావ. బావమరిది కోసం, ఆయన రాజకీయ బాగు కోసం పుష్కర కాలంగా తెర వెనక పనిచేసిన వారిలో అతి కీలకమైన వ్యక్తి. అలాంటి బావ ఇపుడు బావమరిదికి డేంజర్ సిగ్నల్స్ పంపిస్తున్నారు. ఏపీలో రెండున్నరేళ్ళ పాలన మీద తనదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు.
ఏపీలో అన్నిసామాజిక వర్గాలు ఇబ్బందులలో ఉన్నాయని పవన్, చంద్రబాబు అంటే దాన్ని కంప్లీట్ గా రాజకీయ విమర్శగా కొట్టిపారేయవచ్చు. కానీ బ్రదర్ అనిల్ అలాంటి వారు కాదే. ఆయనకు రాజకీయాలతో అసలు సంబంధం లేదు. మరి అలాంటి వారు. వైఎస్సార్ కుటుంబంలోని మనిషి ఇపుడు ఏపీలో పాలన బాలేదు అనేలా కామెంట్స్ చేస్తున్నారు అంటే ఎక్కడో తేడా కొడుతోంది.
దాన్ని కూలంకషంగా చర్చ చేసి అర్ధం చేసుకోవాల్సింది వైసీపీ పెద్దలే. బ్రదర్ అనిల్ కానీ ఆయన సతీమణి జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కానీ వైసీపీ అధికారంలోకి రావడం కోసం ఎంతో సేవ చేశారు. అది వైసీపీ వారికి ఎంత వరకు తెలుసో కానీ రాష్ట్ర ప్రజానీకానికి మాత్రం బాగా తెలుసు.
ఒక ఆడ మనిషి తన అన్న జైలులో ఉంటే విపక్షాలు అన్నీ కామెంట్స్ చేస్తూంటే పార్టీ భవిష్యత్తు కోసం ఏకంగా మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా. ఆమె నిజంగా ఆ రోజున వీధిలోకి వచ్చి వైసీపీకి అండగా నిలబడకపోతే ఈ రోజు వైసీపీ అధికారంలోకి వచ్చేదా. అసలు పార్టీ ఉండేదా అన్నది కూడా ఆలోచించాలి కదా.
నిజానికి జగన్ ని జైలుకు పంపడం వెనక వైసీపీని సమూలంగా నాశనం చేయాలన్న అజెండా నాటి రాజకీయ ప్రత్యర్ధులకు ఉందని అందరికీ తెలుసు. కానీ దాన్ని వమ్ము చేసి షర్మిల వైసీపీని కంటికి రెప్పలా కాపాడారు. మరి 2019 ఎన్నికల వేళ షర్మిల ఊరూ వాడా తిరిగి చేసిన ప్రచారం కూడా చాలా కీలకం అని చెప్పాలి. బైబై బాబూ అంటూ షర్మిల నాడు చేసిన ప్రచారానికి జన స్పందన అనూహ్యంగా వచ్చింది. మరి బ్రదర్ అనిల్ కూడా వివిధ సామాజిక వర్గాలను ఒక చోటకు చేర్చి వైసీపీకి పట్టం కట్టేలా చూశారు.
అదే అనిల్ ఇపుడు అంటున్న మాటలను కూడా వైసీపీ అధినాయకత్వం ఆలకించాల్సిందే. అందరూ కలిస్తేనే అధికారం దక్కింది. అది అధికారం కాదు, ఒక ఉద్యోగం అని కూడా ఆయన జగన్ని ఉద్దేశించి ఇండైరెక్ట్ గా విశాఖ మీడియా ముందు కామెంట్స్ చేశారు.
ఇక ఏపీకి బీసీ సీఎం అవసరం అని ఆయన అన్నారు. అంతే కాదు, వారిని తన మద్దతు ఇస్తామని కూడా కుండబద్ధలు కొట్టారు. దీన్ని బట్టి చూస్తే వైసీపీ పెద్దలు తమ పాలన అద్భుతం అని చెప్పుకుంటున్నది ఎంతవరకూ కరెక్ట్ అన్నది ఆలోచించుకోవాలి. గ్రౌండ్ రియాల్టీస్ ని తోసిపుచ్చకుండా ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. బావ బతుకు కోరుతారు అని సామెత. ఇపుడు బావమరిది పార్టీ బతుకు కోరే ఈ మాటలు చెప్పారేమో అని విశ్లేషించుకుంటే వైసీపీకి మంచిది అన్న మాట వినిపిస్తోంది.
అలా కాకుండా అంతా బాగుందని మురిసినా, లేక తమను విమర్శించేవారు అంతా శత్రువర్గమే అని ఒకే గాటకు కట్టి ముందుకు సాగినా ముప్పు తప్పదనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక ఏపీలో పొలిటికల్ సీన్ రోజు రోజుకూ బాగా మారుతోంది, కొత్త కూటములు పుట్టుకువస్తున్నాయి. అలాగే బలమైన సామాజిక వర్గాల ఆకాంక్షలను ఎవరూ తోసిపుచ్చలేరు. వీటి మధ్య ఇంకా వ్యక్తిగత ఇమేజ్ ని నమ్ముకుని తమకే మళ్ళీ విజయం అని వైసీపీ అధినాయకులు ఉంటే మాత్రం ఇబ్బందులే అన్న మాట కూడా ఉంది.