కాంగ్రెస్ చెబితే వినాలి : అబ్బా ! ఎన్నాళ్లకు జగన్ పై సెటైర్లు ?

Update: 2022-03-28 14:30 GMT
భార్య : నాకు వచ్చిన అమ్మ ఒడి డబ్బులతో నువ్వు మందు తాగుతున్నావు అది తెలుసుకో...
భర్త : నేను మందు తాగుతుండటం వలనే నీకు అమ్మ ఒడి డబ్బులు వస్తున్నాయి అది నువ్వు తెలుసుకో...
జై జగన్ అన్న - ఏపీ కాంగ్రెస్ పార్టీ  - సోష‌ల్ మీడియా పేజ్

చాలా రోజుల‌కు జ‌గ‌న్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. అంతేకాదు సోషల్ మీడియా వేదిక‌గా కామెంట్లు కూడా పోస్ట్ చేసింది. సాధార‌ణంగా పెద్ద‌గా వైసీపీ పై మాట్లాడ‌ని పార్టీ కాంగ్రెస్. అయినా కూడా తాజాగా జ‌గ‌న్ ను కూడా టార్గెట్ చేస్తూ పోస్టులు రాస్తుంది. వాస్త‌వానికి జ‌గ‌న్ ఆ గూటి నుంచి వ‌చ్చిన‌ప్పుడు పీసీసీ చీఫ్ గా బొత్స స‌త్యనారాయ‌ణ ఉండేవారు.

ఆయ‌న ఆ రోజు పీసీసీ చీఫ్ హోదాలో జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల‌పై అధిష్టానం కోరిక మేరకు మాట్లాడేవారు. త‌రువాత కాలంలో ఆయ‌న మాత్రం ఎంచ‌క్కా వైసీపీ గూటికి చేరిపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీ కి దిక్కెవ‌ర‌ని ? ప్ర‌స్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న సాకే శైలాజ‌నాథ్ కూడా ఓ విధంగా జ‌గ‌న్ స్నేహితుడే ! క‌నుక వైసీపీని ఎదిరించే కాంగ్రెస్ లీడ‌ర్ లేరనే తేలిపోయింది.

వాస్త‌వానికి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పెద్ద‌గా ప్ర‌జా పోరాటాలు సాగించ‌లేదు. పెద్ద‌గా విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించ‌నూ లేదు. కేవీపీ లాంటి లీడ‌ర్లు ఉన్నా కూడా వారంతా సైలెంట్ అయిపోయారు. ఇక పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మ‌యిన గొంతుక వినిపించేవారే లేకుండా పోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికిప్పుడు కోలుకోవ‌డం క‌ష్ట‌మే ! అందుకే పొత్తుల వైపు గ‌త సారి ఆలోచించి టీడీపీతో వెళ్లింది. అయినప్ప‌టికీ  ఫ‌లితాలు పెద్ద‌గా లేవు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ ను ఎదుర్కొనే నాయ‌కుడే విప‌క్ష పార్టీలో లేడ‌ని ఓ విధంగా ప్ర‌త్యామ్నాయ నేత‌లు రావాల్సిన అవ‌స‌రం ఉన్నా కూడా కాంగ్రెస్ ఎందుకనో చొర‌వ చూప‌డం లేదు అని తెలుస్తోంది.

ఇదే ద‌శ‌లో తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద‌గా పుంజుకోలేదు క‌నుక వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోక‌పోయినా పెద్ద‌గా ఫ‌లితాలు ఉండ‌వు.ఈ నేప‌థ్యం క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ తిరిగి ఒక‌నాటి వైభ‌వం అందుకోవాలంటే ప్ర‌జా పోరాటాలు చేస్తూ, ప్ర‌భుత్వ విధానాల‌పై మాట్లాడుతూ సంబంధిత చైత‌న్యం తీసుకుని రావాలి.
Tags:    

Similar News