సోనియా అలెర్ట్...నాన్ గాంధీకే జై... ?

Update: 2022-03-12 16:30 GMT
మొత్తానికి నిద్రావస్థలో ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వాన్ని అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా తట్టిలేపాయి అనుకోవాలి. కాంగ్రెస్ కి తన చోటు ఏంటో ప్రజా తీర్పు ద్వారా స్పష్టం అయింది అంటున్నారు. దీంతో కాంగ్రెస్ లోనే అంతర్మధనం జరుగుతోంది. దానితో పాటే అంతర్యుద్ధం కూడా జరుగుతోంది.

సీనియర్స్ వర్సెస్ అధినాయకత్వంగా ఆ పోరు సాగుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో అత్యున్నత వేదిక అయిన సీడబ్ల్యూసీ మీటింగ్ అర్జంట్ గా జరపబోతున్నారు. ఈ మీటింగ్ ఈ నెల 13న జరగనుంది. ఇది ఒక విధంగా చెప్పాలీ అంటే కీలకమైన భేటీ. ఈ సమావేశానికి కాంగ్రెస్ తాత్కాలిక ప్రెసిడెంట్ సోనియా గాంధీ అధ్యక్షత వహిస్తారు.

వర్చువల్ గా జరిగే ఈ సమావేశంలో సీడబ్య్లూసీ మెంబర్స్ అంతా పాలుపంచుకుంటారు. ఇక గులాం నబీ అజాది. కపిల్ సిబాల్, మనీష్ తివారీ వంటి వారు కూడా ఈ భేటీలో హైలెట్ గా ఉంటారని వేరేగా చెప్పాల్సింది లేదు. ఇప్ప్పటికే జీ23 పేరిట సీనియర్ నేతలు అంతా కలసి కాంగ్రెస్ అధినాయకత్వానికి లేఖలు సంధించి కన్నెర్ర అయ్యారు.

 ఇపుడు వారికి ఒక అవకాశం. తాము చెప్పిన మాటను పెడచెవిన పెట్టినందువల్లనే ఈ దుస్థితి అని వారు ఈ మీటింగులో నిలదీస్తారు అన్నది స్పష్టం.

అంతే కాదు కాంగ్రెస్ లో సంస్థాగత ఎన్నికలు పెట్టాలని, అధ్యక్షుడి మార్పు వంటి వాటి మీద కూడా డిమాండ్స్ ఉంటాయని అంటున్నారు. అన్ని విషయాలూ కూలంకషంగా చర్చించేందుకు ఏఐసీసీ మీటింగ్ కూడా తొందరలో పెట్టాలని కోరుతారు అంటున్నారు.

 మొత్తానికి సోనియా గాంధీ ఈ మీటింగ్ పెట్టడం ద్వారా అలెర్ట్ అయ్యారనే అనుకోవాలి. ఇక రెబెల్స్ డిమాండ్లను పక్కన పెట్టేలా నాన్ గాంధీ కేటగిరీలో తమకు అనుకూలమైన నేతను తెచ్చి ప్రెసిడెంట్ చేసే ప్రతిపాదన కూడా ఉందని అంటున్నారు.  మొత్తానికి గాంధీలు అలా సైడ్ అయినా పట్టు వారిచేతిలోనే ఉంటే కాంగ్రెస్ కి గాంధీ కుటుంబేతరుడు ప్రెసిడెంట్ అయినా జాతకం మారుతుందా అన్నదే డౌట్.

ఇక రెబెల్స్ మాట వినకూడదని, ఎత్తుకు పై ఎత్తు వేయాలని హై కమాండ్ డిసైడ్ అయితే మాత్రం కాంగ్రెస్ లో కొత్త గొడవలు కూడా స్టార్ట్ అవుతాయని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి సోనియా నాయకత్వానికి పరీక్షగా మారిన ఈ పరిణామాలు పార్టీని ఏ తీరానికి చేరుస్తాయో.
Tags:    

Similar News