ఓ వైపు వివాదం మ‌రో వైపు వేడుక మ‌ధ్య‌లో బొత్స ?

Update: 2022-03-09 11:30 GMT
రానున్న 2024 వ‌ర‌కూ రాజ‌ధాని హైద్రాబాదేన‌ని మంత్రి బొత్స స‌త్య నారాయ‌ణ చెప్పిన రోజు నుంచి వివాదాలు రేగుతూనే ఉన్నాయి.మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా బొత్స వ్యాఖ్య‌ల‌పై మండి ప‌డ్డారు.తాజాగా సీమ లీడ‌ర్ జేసీ దివాక‌ర్ రెడ్డి కూడా బొత్స పై సెటైర్లు వేశారు.బొత్స మ‌ళ్లీ హైద్రాబాద్ కు వెళ్లాల‌ని అనుకుంటున్నార‌ని అంటూ వ్యంగ్య భాష్యం చెప్పారు.

ఎవ‌రు ఏమ‌ని అనుకున్నా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం 3 రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డి ఉంద‌ని అంటోంది.ఇందుకు సంబంధించి అసెంబ్లీ వేదిక‌గా శాస‌న వ్య‌వ‌స్థ‌కు,న్యాయ వ్య‌వ‌స్థ‌కు ఉన్న హ‌క్కులు,అధికారాల‌పై చ‌ర్చ చేసేందుకు కూడా ఈ బ‌డ్జెట్ స‌మావేశాల‌ను వినియోగించుకోవాల‌ని భావిస్తోంది.

ఈ నేప‌థ్యంలో మంత్రి బొత్స అత్యంత ఆస‌క్తిదాయ‌క రీతిలో చేసిన వ్యాఖ్య‌లు పెను సంచ‌ల‌న‌మే రేపాయి.వాస్త‌వానికి ఉమ్మ‌డి రాజ‌ధాని విష‌య‌మై ఇప్ప‌టిదాకా పెద‌వి విప్ప‌ని వైసీపీ ఇప్పుడే ఎందుకు మాట్లాడుతుందంటే..ఈ విష‌య‌మై కొన్ని సందేహాలు కూడా రేగుతున్నాయి.

ఎందుకంటే 3 రాజ‌ధానుల బిల్లు విత్ డ్రా అయిపోయిన నేప‌థ్యంలో..అదే విధంగా కోర్టు కూడా సీఆర్డీఏ యాక్ట్ త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయాల‌ని చెప్ప‌డంతో ఏం చేయాలో తోచ‌ని స్థితి రాజ‌ధాని హైద్రాబాద్ మాత్ర‌మేన‌ని బొత్స చెప్పి మ‌రో కొత్త వివాదం అందుకోవ‌డం విశేషం.

ఇవి ఇలా ఉంటే ఇవాళ బొత్స ఇంట వెడ్డింగ్ రిసెప్ష‌న్ ఉంది.ఆయ‌న కుమారుడు సందీప్ వివాహ వేడుకలు ఇటీవ‌ల హైద్రాబాద్ లో జ‌రిగాయి.వివాహ అనంత‌ర వేడుక‌ల‌ను (వెడ్డింగ్ రిసెప్ష‌న్) ను విజ‌య‌న‌గ‌రం జిల్లా, గాజుల‌రేగ‌లో ఉన్న సీతం కాలేజీ ప్రాంగణాన నిర్వ‌హిస్తున్నారు.వేడుకలకు ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌లే కాదు టీడీపీ నాయ‌కులు కూడా హాజ‌రు కానున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా ముమ్మ‌రం అయ్యాయి.

ఇదే సంద‌ర్భంలో బొత్స ఇంటి వివాహ వేడుక‌ల‌పై కూడా టీడీపీ వివాద‌మే చేసింది. ఆయ‌న ఇంట వేడుకలున్నాయి క‌నుక‌నే జ‌గ‌న్ త‌న త‌ర‌ఫున సాయం అన్న విధంగా అసెంబ్లీ స‌మావేశాల‌కు సెల‌వు ఇచ్చారు అని చంద్ర‌బాబు సైతం మండిప‌డ్డారు.ఇన్ని త‌గాదాలూ, తంటాలూ ఉన్నా కూడా ఇవాళ విజ‌య‌న‌గ‌రంలో కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్  మామిడి శ్రీ‌కాంత్ తో న‌వ్వుతూ క‌నిపించ‌డమే బొత్స స్పెష‌ల్.
Tags:    

Similar News