కాలం మారింది. అభిరుచులు మారాయి. సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. దీంతో.. ఇంటర్నెట్ వాడకం భారీగా పెరిగిపోయింది. చూస్తున్నంతనే 3జీ కాస్తా 4జీ రావటం మరికొద్ది రోజుల్లో 5జీ సైతం అందుబాటులోకి వచ్చేస్తోంది. సెల్ ఫోన్ అంటే మొదట్లో మాట్లాడుకోవటం.. ఫోటోలు తీసుకోవటం లాంటి వాటికే పరిమితమైన వాటికి భిన్నంగా డేటాను వినియోగిస్తున్న వైనం రోజురోజుకు ఎక్కువ అవుతోంది.
జియో ఎంట్రీ తర్వాత డేటాను వినియోగించే తీరు మొత్తం మారిపోవటం తెలిసిందే. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఫోన్ ను చూసుకోవటం.. సోషల్ మీడియా.. వాట్సాప్ లను చూసేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్న పరిస్థితి. తాజాగా నెల వారీగా వినియోగించే డేటాకు సంబంధించిన వివరాల్ని చూస్తే.. దేశంలో ఎంత భారీగా డేటాను వినియోగిస్తున్నారన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
తాజాగా విడుదలైన నివేదికల ప్రకారం మొబైల్ బ్రాడ్ బ్యాండ్ వాడే వారి సంఖ్య 34.5 కోట్ల నుంచి 76.5 కోట్లకు పెరిగింది. అదే సమయంలో డేటాను వినియోగిస్తున్న తీరు ఎక్కువైంది. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం ఒక్కొక్కరు నెలకు 17జీబీ డేటాను వినియోగిస్తున్నట్లుగా తేలింది. రోజువారీ తిండి కంటే కూడా.. నెలవారీగా వాడేసే డేటానే ఎక్కువైపోతుందన్న మాట వినిపిస్తోంది.
మిగిలిన ఏజ్ గ్రూపులతో పోలిస్తే.. యువత రోజువారీగా ఎనిమిది గంటల పాటు సెల్ ఫోన్ కే కేటాయిస్తున్నట్లు చెబుతున్నారు. అంటే నిద్ర పోయే ఎడెనిమిది గంటలకు అదనంగా ఫోన్ చూసేందుకు మరో ఎనిమిది గంటలు అంటే.. రోజు మొత్తాన్ని ఎలా వినియోగిస్తున్నారన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. నోకియా ప్రతి ఏటా విడుదల చేసే మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఇండెక్స్ రిపోర్టు 2022 ప్రకారం చూస్తే.. మన దేశంలో డేటా వినియోగం బాగా పెరిగినట్లుగా పేర్కొన్నారు.
4జీ మొబైల్ డేటా వినియోగం 31 శాతం పెరిగితే.. నెలావారీ సగటు వినియోగం 26.6 శాతం పెరిగింది. గత ఏడాది 4 కోట్ల మంది 4జీ సర్వీసుకు అప్ గ్రేడ్ కావటమో.. సర్వీసు పొందటమో జరిగినట్లుగా పేర్కొంది.
మిగిలిన అంశాల్ని పరిగణలోకి తీసుకుంటే.. డేటా వినియోగ అంతకంతకూ పెరగటం.. మొబైల్ తో మమేకం కావటం ఎక్కువ కావటమే కాదు.. అమూల్యమైన సమయాన్ని మొబైల్ వాడకానికే అంకితమిస్తున్న విషయం తాజా రిపోర్టును చూస్తే అర్థం కాక మానదు.